జాతీయ వార్తలు

ఆర్థిక సహకారంపై చైనాతో జైట్లీ చర్చలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీజింగ్, జూన్ 25: భారత ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ శనివారం ఇక్కడ చైనా ఆర్థిక మంత్రి లో జివీతో సమావేశమై ద్వైపాక్షిక ఆర్థిక సహకారం, ప్రపంచ స్థూలార్థిక పరిస్థితిపై చర్చించారు. ఈ ఇద్దరు నేతలు ప్రపంచ స్థూలార్థిక పరిస్థితితోపాటు ద్వైపాక్షిక ఆర్థిక సహకారం, జి20, బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా) అంశాలపై చర్చించారని ఇక్కడి భౌరత దౌత్య కార్యాలయం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ నెల 27న లో జివీతో మంత్రుల స్థాయిలో వార్షిక ఆర్థిక చర్చలు జరపడానికి జైట్లీ గురువారం ఇక్కడికి వచ్చారు. జైట్లీ శనివారం లో జివీతో భేటీ కావడానికి ముందు ఇక్కడ జరిగిన ఆసియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇనె్వస్ట్‌మెంట్ బ్యాంక్ (ఎఐఐబి) గవర్నర్ల బోర్డు వార్షిక సమావేశంలో పాల్గొన్నారు. భారత ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్ బీజింగ్‌కు రాలేని పరిస్థితిలో ఉండటం వల్ల ఇరు దేశాల మధ్య జరగవలసిన ఆర్థిక కార్యదర్శుల స్థాయి చర్చలు జూలైకి వాయిదా పడ్డాయి. యూరోపియన్ యూనియన్ (ఇయు) నుంచి బ్రిటన్ వైదొలగడం (బ్రెగ్జిట్) వల్ల భారత్‌పై పడే ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవడానికి ఢిల్లీలో ఉండాలని కేంద్ర ప్రభుత్వం దాస్‌ను ఆదేశించింది. భారత్, చైనా ఇప్పటివరకు ఆర్థిక కార్యదర్శుల స్థాయిలో ఏడుసార్లు చర్చలు జరిపాయి. ఇందులో చివరి సమావేశం 2014లో ఢిల్లీలో జరిగింది.
పురోగతిలో సిపిఇసి
46 బిలియన్ డాలర్ల అంచనా వ్యయంతో చేపట్టిన చైనా-పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్ (సిపిఇసి) పనులు పురోగతి సాధించాయని పాకిస్తాన్ వ్యవహారాలు చూసే చైనా రాయబారి సన్ వెయిడాంగ్ శనివారం చైనా అధికార వార్తాసంస్థ జిన్హువాకు చెప్పారు. ఈ కారిడార్ పాక్ ఆక్రమిత కాశ్మీర్ మీదుగా వెళ్తుండటం గమనార్హం. ఈ ప్రాజెక్టు పురోగతివల్ల స్థానిక ప్రజలు లబ్ధి పొందారని వెయిడాంగ్ తెలిపారు. ఈ ప్రాజెక్టు పట్ల ఇంటా బయటా వ్యతిరేకత తీవ్రమవుతోందని చైనా అధికార పత్రిక గ్లోబల్ టైమ్స్‌లో ఇటీవల ఒక వార్తాకథనం ప్రచురితమైన నేపథ్యంలో వెయిడాంగ్ ప్రాజెక్టు పురోగతి గురించి చెప్పడం ప్రాధాన్యత సంతరించుకుంది.

చిత్రం భారత్‌కు ఎన్‌ఎస్‌జి సభ్యత్వాన్ని వ్యతిరేకించినందుకు నిరసనగా శనివారం ఢిల్లీలో చైనా వస్తువులను తగులబెట్టి నినాదాలు చేస్తున్న హిందూ సేన కార్యకర్తలు