జాతీయ వార్తలు

అదంతా ‘మసాలా’ హాస్యం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఏప్రిల్ 24: బాధ్యతారహిత ప్రకటనలతో పార్టీ పరువు తీయొద్దంటూ బీజేపీ యంత్రాంగానికి కొద్దిరోజుల క్రితం ప్రధాని నరేంద్ర మోదీ చేసిన హెచ్చరికలను శివసేన ఎద్దేవా చేసింది. అలాంటి హెచ్చరికలు పార్టీకి ఫలితాలివ్వవు, మీడియాకు ‘మసాలా’ మాత్రమే ఇస్తుందంటూ శివసేన అధికార పత్రిక ‘సామ్నా’ సంపాదకీయంలో దెప్పిపొడిచింది. బీజేపీకి మిత్రపక్షమే అయినా, ఉద్దవ్ థాకరే నాయకత్వంలోని శివసేన ఎప్పటికప్పుడు బీజేపీ వైఖరిని ఎండగట్టడం తెలిసిందే. గత ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ పార్టీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తూ ‘బాధ్యతారహిత ప్రకటనలతో పార్టీ పరువు బజారీకీడ్చొద్దు’ అని హెచ్చరిక చేయటం తెలిసిందే. ఇలాంటి హాస్యాస్పదమైన హెచ్చరికలు గత బీజేపీ పార్టీ సమావేశాల్లోనూ చేసినా, ఫలితాలు ఏమయ్యాయని సామ్నా ప్రశ్నించింది. బీజేపీ మంత్రులు, నేతలు తమను తాము మోదీలుగా భావించుకుని తోచిందల్లా మాట్లాడేయడం మామూలేనని వ్యంగ్య బాణాలు సంధించింది. ‘మసాలా’ (వివాదాస్పద వ్యాఖ్యలు) వద్దంటున్న బీజేపీకంటే, తమకు కావాల్సిన పచ్చళ్లు, పాపడలు, మసాలాలు అందిస్తున్న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీలాంటి వాళ్లే మీడియాకు బెటరంటూ వ్యాఖ్యానించింది. ‘్భరత్‌లాంటి అతి పెద్ద దేశంలో ఒకటి రెండు (కథువాలో మైనర్ గ్యాంగ్‌రేప్, జమ్మూకాశ్మీర్‌లో 17ఏళ్ల మైనర్‌పై అత్యాచారం) రేప్ కేసులు చోటుచేసుకోవడం సహజమని, వాటిని భూతద్దంలో చూడాల్సిన పని లేదం’టూ కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత సంతోష్ గాంగ్వార్ చేసిన వ్యాఖ్యలను శివసేన తప్పుబట్టింది. తన వ్యాఖ్యలతో మహిళలను తీవ్రంగా అవమానించి మనసులను గాయపర్చిన గాంగ్వార్ రాజీనామాను ఎవ్వరూ ఎందుకు డిమాండ్ చేయడం లేదని నిలదీసింది. ఈ సందర్భంగా 26/11 ఉగ్రదాడి ఘటన ఒకటి గుర్తు చేసింది. మహానగరాల్లో ఇలాంటి చిన్న సంఘటనలు (బాంబు పేలుళ్లు) మామూలేనంటూ అప్పటి హోంమంత్రి దివంగత ఆర్‌ఆర్ పాటిల్ చేసిన వ్యాఖ్యలపై దేశం మొత్తం భగ్గుమంది. అంతకంటే తీవ్రమైన వ్యాఖ్యలు చేయడమేకాకుండా, తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానంటూ చెప్పుకుంటున్న గాంగ్వార్ రాజీనామాను ఎవ్వరూ డిమాండ్ చేయకపోవడం హేయమైన విషయంగా అభివర్ణించింది. ఇటు రాష్ట్రం, అటు కేంద్రంలో అధికార బీజేపీ భాగస్వామ్యపక్షంగా ఉన్నప్పటికీ, వివిధ అంశాలపై సందర్భానుసారం బీజేపీ సీనియర్ నేతలను శివసేన టార్గెట్ చేయడం మామూలే.