జాతీయ వార్తలు

భారత్ ప్రతీకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్, ఏప్రిల్ 24: తరచూ కవ్వింపులకు, కాల్పులకు దిగుతున్న పాకిస్తాన్ సైన్యాన్ని భారత్ ఎదురుదెబ్బ తీసింది. పూంఛ్ జిల్లాలోని మెంధార్ సెక్టార్ కృష్ణఘాటి వద్ద జరిగిన ఎదురుకాల్పుల్లో నలుగురు పాకిస్తాన్ సైనికులను హతమార్చిం ది. వీరంతా ఉత్తర ఇన్‌ఫాంట్రి రెజిమెంట్ కు చెందినవారు. గత సోమవారం జరిగిన కాల్పుల్లో ఓ పాకిస్తాన్ సైనికుడు మరణించాడు. రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతూ పాకిస్తాన్ సైనికులు తెగబడుతుండటంతో భారత్ సైనికులు గట్టిగా తిప్పికొట్టారు. పాకిస్తాన్ భూభాగంలోని కొన్ని సైనిక శిబిరాలు ధ్వంసమయ్యాయి కూడా. ఈ ప్రాం తంలో గత మూడు రోజులుగా ఎదురుకాల్పులు జరుగుతూనే ఉన్నాయి. ఇదిలావుండగా ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో జరిపిన కాల్పుల్లో ఒక సైనికుడు, జమ్మూకాశ్మీర్‌కు చెందిన పోలీసు మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ఘటన తర్వాత జరిగిన ఎదురుకాల్పుల్లో జైషే మహమ్మద్‌కు ముగ్గురు ఉగ్రవాదులను భారత్ సైనికులు హతమార్చారు. పుల్వామా జిల్లా త్రాల్ ప్రాంతంలోని లామ్ అడవిలో భారీ ఆయుధ సామగ్రితో ఉగ్రవాదుల ముఠా ఒకటి సంచరిస్తోందన్న సమాచారం మేరకు గాలింపు చర్యలను ముమ్మరం చేసినట్లు పోలీసు అధికారి ఒకరు వెల్లడించారు. ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో ఎదురుకాల్పులు అనివార్యమైందని, ఒక సైనికుడు, ఒక పోలీసుకు తీవ్ర గాయాలయ్యాయని ఆయన తెలిపారు.