జాతీయ వార్తలు

అవినీతి కాంట్రాక్టర్లను బుల్‌డోజర్‌తో తొక్కిస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బేతుల్, మే 19: అవినీతి రోడ్ కాంట్రాక్టర్లను బుల్‌డోజర్ కింద ఉంచి తొక్కించేస్తానని కేంద్ర మంత్రి నితిన్‌గడ్కరీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మధ్యప్రదేశ్‌లోని బేతుల్ జిల్లాలో జరుగుతున్న రోడ్‌పనులను ఆయన శనివారం పరిశీలించారు. అయితే అక్కడ పనులు అస్తవ్యస్తంగా జరుగుతున్న విషయాన్ని గమనించిన ఆయన వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘పనులు సక్రమంగా జరుగుతున్నాయో లేదో చూడాల్సిన బాధ్యత కాంట్రాక్టర్లదే కదా.. ఒకవేళ పనులు సక్రమంగా లేకపోతే రాళ్లకు బదులుగా కాంట్రాక్టర్లను బుల్‌డోజర్ కిందకు తోసి తొక్కిస్తానని ముందే చెప్పా’ అని గడ్కరీ హెచ్చరించారు. పనుల్లో అవినీతిని ఎంతమాత్రం సహించనని, ఈ దేశంలోని డబ్బు కాంట్రాక్టర్లదు కాదు దేశంలోని పేదలదన్న విషయం మరువరాదని అన్నారు. ఈ హెచ్చరికలు చేసినప్పుడు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ ఆయన పక్కనే ఉన్నారు. కాగా, గడ్కరీ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి.