జాతీయ వార్తలు

మోదీ దుస్తులంత ఖర్చులేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పనాజీ, జూన్ 30: అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తన ప్రభుత్వం ప్రచార ఆర్భాటం కోసం కోట్లాది రూపాయలను వెచ్చిస్తోందంటూ వచ్చిన విమర్శలను ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తిప్పికొట్టారు. ప్రధాన మంత్రి మోదీ దుస్తులపై పెట్టిన ఖర్చుకంటే కూడా ప్రకటనల ద్వారా తాము వెచ్చించింది చాలా తక్కువేనని అన్నారు. ఈ రెండేళ్ల కాలంలో తమ ప్రభుత్వం ఇచ్చిన ప్రకటనల ఖర్చును బిజెపి నాయకత్వం తీవ్రంగా దుయ్యబడుతున్న నేపథ్యంలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు. ఒక సారి వేసుకున్న దుస్తులను మరోసారి మోదీ వేసుకోలేదని, ఒక్కొక్కదాని ఖర్చు రెండు లక్షల రూపాయల పైనేనని కేజ్రీవాల్ వెల్లడించారు. తాము అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 526 కోట్ల రూపాయల ఖర్చుతో ప్రకటనలు ఇచ్చామన్న ఆరోపణల్లో వాస్తవం లేదని అన్నారు. అయితే ఇప్పటి వరకూ తాము ఇచ్చిన ప్రకటనకు అయిన ఖర్చు 76 కోట్ల రూపాయలేనని కేజ్రీవాల్ చెప్పారు. ఈలెక్కన చూస్తే ఢిల్లీ ప్రభుత్వంలోని ప్రతి విభాగం ఇచ్చిన మొత్తం ప్రకటనల ఖర్చును లెక్కలోకి తీసుకున్నా అది మోదీ దుస్తులపై ఖర్చుపెట్టిన దానికంటే తక్కువేనని గురువారం ఇక్కడ ఎడిటర్ల సమావేశంలో కేజ్రీవాల్ స్పష్టం చేశారు. ఓ రోజులో ఐదుసార్లు మోదీ తన దస్తులు మార్చుకుంటారని, ఈలెక్కన ఒక్కో జత ఖరీదు రెండు లక్షలు అనుకుంటే ఆయన దస్తులకే పదిలక్షలు అవుతుందని ముఖ్యమంత్రి తెలిపారు. వేసుకున్న దస్తులు మళ్లీ వేసుకోవడం గానీ, వాటిని ఉతికించుకుని మళ్లీ వాడడం గానీ మోదీ చేయలేదని తెలిపారు. ఇందుకు సాక్ష్యాలు కావాలంటే గూగుల్‌లో మోదీ క్లోత్స్ అని కొడితే ఆధారాలు లభిస్తాయని వెల్లడించారు.