జాతీయ వార్తలు

ఉపాధ్యాయులకో పోర్టల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 30: ఉపాధ్యాయుల్లో వృత్తి నైపుణ్యాన్ని వెలికితీయాలన్న ఉద్దేశంతో కేంద్రం ఓ పోర్టల్‌ను ప్రారంభించింది. ప్రజలకు విద్యాహక్కు ప్రాధాన్యత గుర్తుచేయడంతోపాటు మెరుగైన బోధన అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని కేంద్ర మానవ వనరుల మంత్రి స్మృతి ఇరానీ స్పష్టం చేశారు. డిస్ట్రిక్ ఇనిస్టిట్యూట్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, ట్రైనింగ్ (డిఐఇటి)ల కోసం ‘ప్రశిక్షక్’ టీచర్ పోర్టల్‌ను గురువారం ఆమె ప్రారంభించారు. విద్యావ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమిస్తూ, లక్ష్యాలను చేరుకోవాలని ఇరానీ పిలుపునిచ్చారు. విద్య రంగం గురించి మాట్లాడుకునే సందర్భంలో ఒక రకమైన నిరాశ, నిస్పృహ కనిపిస్తోందని ఆమె అన్నారు. ఈ అభిప్రాయం పొగొట్టడానికి కృషి చేయాల్సిన ఆవశ్యకత ఉందని మంత్రి పిలుపునిచ్చారు. పలువురు రాష్ట్ర మంత్రులు, అధికారులు ఈ పోర్టల్ ప్రారంభ కార్యక్రమానికి హాజరయ్యారు. భావిపౌరులను తీర్చిదిద్దాల్సిన బాధ్యత అందరిపై ఉందని, ముఖ్యంగా ఉపాధ్యాయుల పాత్ర మరింత కీలకమని ఆమె చెప్పారు. నిర్ధేశించిన లక్ష్యాలను చేరుకోవడానికి పాటుపడాలని అన్నారు. 1987 నుంచి ఉపాధ్యాయ విద్యకు కేంద్రం నిధులు కేటాయిస్తున్నప్పటికీ, నైపుణ్యం విషయానికి వస్తే జాతీయ స్థాయిలో ఓ యంత్రాంగం లేదని ఆమె పేర్కొన్నారు. దీనిపై నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్స్ ఎడ్యుకేషన్(ఎన్‌సిటిఇ) నివేదిక ఆధారంగా ప్రశిక్షక్ పోర్టల్‌ను ప్రారంభించినట్టు తెలిపారు. మెరికల్లాంటి ఉపాధ్యాయలను దేశానికి అందించాలన్న ఉద్దేశంతో దీన్ని ప్రవేశపెట్టినట్టు వెల్లడించారు. విద్యకు సంబంధించి అనేక అంశాలు, ఉపాధ్యాయుల ఖాళీలు వంటి సమాచారానికి పోర్టల్ ఉపయోగపడుతుందని చెప్పారు. ప్రస్తుతం డైట్‌లకు ఉపయోగపడుతుందన్న మంత్రి త్వరలోనే దేశంలోని అన్ని ఉపాధ్యాయ శిక్షణ కేంద్రాలకు అనుసంధానం చేస్తామన్నారు.

చిత్రం.. ‘ప్రశిక్షక్’ టీచర్ పోర్టల్‌ను ప్రారంభిస్తున్న కేంద్ర మానవ వనరుల మంత్రి స్మృతి ఇరానీ