జాతీయ వార్తలు

ముంబయి మందుల దుకాణంలో మంటలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూన్ 30: ముంబయిలోని అంధేరీ ప్రాంతంలోని ఓ మందుల దుకాణంలో గురువారం తెల్లవారుజామున సంభవించిన ఘోర అగ్నిప్రమాదంలో తొమ్మిది మంది చనిపోయారు. చనిపోయిన వారిలో నలుగురు చిన్నారులు, ఓ పసికందు ఉన్నారని అగ్నిమాపక అధికారులు తెలిపారు. షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్నిప్రమాదం సంభవించి ఉండవచ్చని భావిస్తున్నామని, ఏది ఏమయినప్పటికీ ప్రమాద కారణాలపై దర్యాప్తు జరుపుతున్నట్లు అధికారులు చెప్పారు. గ్రౌండ్‌ఫ్లోర్‌లో మందుల దుకాణం ఉండగా, మొదటి, రెండో అంతస్థుల్లో కుటుంబాలు కాపురం ఉంటున్నాయి. తొలుత మందుల దుకాణంలో చెలరేగిన మంటలు ఆ వెంటనే పై అంతస్థులకు వ్యాపించాయి. ప్రమాదంలో మొదటి అంతస్థుల్లో ఉంటున్న సబురియా మోజిన్‌ఖాన్ కుటుంబానికి చెందిన మొత్తం ఎనిమిది మంది అక్కడికక్కడే చనిపోగా, కాలిన గాయాలతో ఆస్పత్రిలో చేరిన మహిళ ఆ తర్వాత ఆస్పత్రిలో చనిపోయినట్లు ముంబయి పోలీసు అధికార ప్రతినిధి అశోక్ ధుదే చెప్పారు. మంటలు చెలరేగిన సమయంలో పై అంతస్థుల్లో ఉన్నవారు నిద్రలో ఉన్నారని, భవనంలో చాలా ఇరుకైన చిన్న మెట్లదారి ఉన్న కారణంగా పైఅంతస్థుల్లో ఉన్నవాళ్లు వెంటనే బయటికి రాలేక మంటల్లో చిక్కుకుని చనిపోయి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. చనిపోయిన వారిలో నాలుగేళ్లనుంచి ఎనిమిదేళ్ల మధ్య వయసున్న నలుగురు చిన్నారులతో పాటుగా మూడు నెలల పసిబాలుడు కూడా ఉన్నారు. కాగా, మంటలను అదుపు చేసేటప్పుడు అగ్నిమాపక ఉద్యోగి ఒకరికి కాలిన గాయాలయ్యాయని, అతడిని దగ్గర్లో ఉన్న కూపర్ ఆస్పత్రిలో చేర్చారని బృహన్ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ అగ్నిమాపక సిబ్బంది చీఫ్ పిఎస్ రహంగ్‌దాలే చెప్పారు. ఉదయం 6.15 గంటలకు తమకు ఫోన్‌కాల్ వచ్చిందని వెంటనే అయిదు అగ్నిమాపక శకటాలు, ఒక వాటర్ ట్యాంకర్, రెండు అంబులెన్స్‌లతో సంఘటన స్థలానికి వెళ్లామని అగ్నిమాపక దళ అధికారి ఒకరు చెప్పారు. మంటలను గంటలో అదుపు చేసినట్లు ఆ అధికారి తెలిపారు. గత కొనే్నళ్లలో ముంబయిలో జరిగిన ఘోర అగ్నిప్రమాదాల్లో ఇది ఒకటని, గత ఏప్రిల్‌లో ఒక భవనంలో చెలరేగిన మంటలను అదుపు చేయడానికి వెళ్లిన నలుగురు అగ్నిమాపక సిబ్బంది మంటల్లో చనిపోయారని అధికారులు తెలిపారు.

చిత్రం.. తగులబడ్డ మందుల దుకాణం