జాతీయ వార్తలు

కేరళలో కయ్యం.. బెంగాల్‌లో నెయ్యమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖరగ్‌పూర్, మార్చి 27: పశ్చిమ బెంగాల్‌లో ఆదివారం ఎన్నికల ర్యాలీలో మాట్లాడిన ప్రధాని మోదీ వామపక్షాలు, కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్‌లపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. కేరళల్లో నువ్వానేనా అంటూ అధికారంకోసం పోటీ పడుతున్న కాంగ్రెస్-వామపక్షాలు పశ్చిమ బెంగాల్‌లో చేతులు కలపడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ పార్టీల ధోరణి బెంగాలీల విజ్ఞతను సవాలు చేయడంగా, అవమానించడంగా ఉందన్నారు.
మమతా బెనర్జీ సారథ్యంలోని తృణమూల్ కాంగ్రెస్ కూడా గత ఐదేళ్లుగా రాష్ట్రానికి చేసిందేమీ లేదన్నారు. తృణమూల్ వల్ల రాష్ట్రంలో పరివర్తన వస్తుందని ఆశించామని కానీ ఈ ఐదేళ్లలో రాష్ట్రం అన్ని విధాలుగా వెనుకబడిపోయిందని మోదీ ధ్వజమెత్తారు. అటు వామపక్షాలు, ఇటు తృణమూల్ కాంగ్రెస్ ఉమ్మడిగా గత నాలుగు దశాబ్దాల్లో రాష్ట్రాన్ని ‘్ధ్వంసం’ చేశాయన్నారు. బిజెపికి పట్టం కడితే అన్ని విధాలుగా మార్పు తెస్తామని.. ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేరుస్తామని తెలిపారు. బెంగాలీలకు ఉన్న సరస్వతీ కటాక్షం దేశంలో మరెవరికీ లేదన్నారు. ఈ విజ్ఞతను కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు సవాలు చేశాయని, అవమానించాయని.. ఇలాంటి పార్టీలను బెంగాలీలు క్షమించరని ఎన్నికల ర్యాలీలో మోదీ అన్నారు. నిజంగా ఈ పార్టీలకు ధైర్యం ఉంటే తమది అవకాశవాదమన్న విషయాన్ని ఒప్పుకోవాలన్నారు. పశ్చిమ బెంగాల్‌లో ఇప్పుడిప్పుడే బలపడుతున్న బిజెపిని ప్రజలు ఆశీర్వదించాలన్నారు. గత నాలుగు దశాబ్దాలుగా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన పార్టీల వల్ల ఏ రకంగానూ రాష్ట్రానికి, ప్రజలకు ప్రయోజనం కలుగలేదన్నారు. బెంగాల్‌లో పరివర్తన తీసుకువచ్చి దాన్ని సరికొత్త మైలురాళ్లను దాటేలా చేయగలనన్న నమ్మకం, ధీమా తనకున్నాయన్నారు. అభ్యర్థులను చూసి కాకుండా బెంగాల్ సర్వతోముఖ వికాసం కోసమే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేయాలన్నారు. బిజెపికి మద్దతిచ్చే వారికి ఓటు వేస్తే బెంగాల్ అభివృద్ధి కల సాకారం అవుతుందన్నారు.

చిత్రం ఖరగ్‌పూర్‌లో ఆదివారం నిర్వహించిన బిజెపి ఎన్నికల ర్యాలీలో ప్రజలకు అభివాదం చేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ. చిత్రంలో పశ్చిమ బెంగాల్ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ జోషి