జాతీయ వార్తలు

ఇలాగైతే కష్టమే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 30: కేంద్ర మంత్రివర్గంలో మార్పులు చేర్పులు చేయాలనుకుంటున్న ప్రధాని మోదీ గురువారం అకస్మాత్తుగా మంత్రుల పనితీరును అంచనా వేసేందుకు ఉపక్రమించడం సంచలనంగా మారింది. ఇందులోభాగంగా ప్రధాని అడిగిన ప్రశ్నలకు పలువురు మంత్రులు ఠారెత్తిపోయినట్లు తెలిసింది. రేస్‌కోర్స్ రోడ్డులోని తన నివాసంలో ప్రధాని సాగించిన ఈ సమీక్ష ఆరు గంటలకు పైగా కొనసాగింది. మోదీ జూలై రెండో వారంలో విదేశీ పర్యటనకు వెళ్లేముందు మంత్రివర్గంలో మార్పులు, చేర్పులు చేయాలనుకుంటున్నారు. దీనికోసం ఆయన బుధవారం రాత్రి బిజెపి అధ్యక్షుడు అమిత్ షాతో దాదాపు ఐదు గంటల పాటు సమావేశమై సమాలోచనలు జరిపారు. ఇది జరిగిన వెంటనే ఆయన మంత్రుల పనితీరును సమీక్షించటం గమనార్హం. ఆయా శాఖలకు బడ్జెట్‌లో చేసిన కేటాయింపులు, ముఖ్యమైన పథకాలకు ఇచ్చిన నిధుల వ్యయం, పథకాల అమలు వంటి అంశాలపై మంత్రుల పనితీరుపై ఆయన ప్రత్యేక నివేదికలు తయారు చేయించుకున్నారు. మంత్రులు తమ శాఖల పనితీరుపై ఇచ్చిన నివేదికలను ఆయన తన కార్యాలయం రూపొందించిన నివేదికలతో పోల్చి చూశారు. తరువాత పిఎంఓ తయారు చేసిన నివేదిక ఆధారంగా మంత్రులను అడిగి వారి పనితీరును సమీక్షించారు. అరుణ్ జైట్లీ, పారికర్, రాజ్‌నాథ్ సింగ్, సుష్మా స్వరాజ్ లాంటి సీనియర్లకు పిఎం ఇంటర్వ్యూ లాంటిది జరగలేదు కానీ మిగతా మంత్రులందరినీ పలు ప్రశ్నలు వేసి, వారి పనితీరును అడిగి తెలుసుకున్నారని చెబుతున్నారు.
కొందరు మంత్రుల పనితీరు పట్ల ప్రధాని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. మొదట ఆయా మంత్రిత్వ శాఖలకు బడ్జెట్‌లో ఆర్థిక శాఖ చేసిన కేటాయింపులపై ఒక
ప్రజెంటేషన్ ఇచ్చినట్లు తెలిసింది. మంత్రులు తమ శాఖల పని తీరుపై చేసిన ప్రజెంటేషన్‌లోని నిజానిజాలను పిఎంఓ తయారు చేసిన నివేదికల ఆధారంగా ప్రధాని నిగ్గు తేల్చినట్లు తెలిసింది. న్యాయ శాఖ మంత్రి సదానంద గౌడ న్యాయ వ్యవస్థలో సంస్కరణలను అమలు చేయటంలో ఘోరంగా విఫలమయ్యారని మోదీ భావిస్తున్నట్లు చెబుతున్నారు. అందుకే ఆయనను ఆ శాఖ నుండి తొలగించి మరో ప్రాధాన్యత లేని శాఖకు పంపించినా ఆశ్చర్యం లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వ్యవసాయ మంత్రి రాధామోహన్ సింగ్ పని తీరు పట్ల కూడా మోదీ అసంతృప్తితో ఉన్నారని అంటున్నారు. ఇంధన శాఖ మంత్రి పీయూష్ గోయల్, పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పని తీరు పట్ల మోదీ పూర్తి సంతృప్తితో ఉన్నందున వారికి పదోన్నతి లభించవచ్చునని చెబుతున్నారు. ఇదిలా ఉంటే తెలంగాణకు చెందిన కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ తమ శాఖకు సంబంధించిన నివేదికను మోదీకి సమర్పించటంతోపాటు స్లైడ్ ప్రజంటేషన్ కూడా ఇచ్చినట్లు చెబుతున్నారు. ప్రధాని గురువారం జరిపిన ముఖాముఖి చర్చల ఆధారంగా మంత్రులకు ర్యాంకింగ్ ఇస్తారని, ఆ తర్వాత మంత్రుల పని తీరుపై సీనియర్ అధికారులతో సమీక్షించాక ఎవరిని ఉంచాలి, ఎవరిని తొలగించాలి, కొత్తగా ఎవరికి ఆవకాశం కల్పించాలనేది నిర్ణయిస్తారని అంటున్నారు. మోదీ మంత్రివర్గంలో ప్రస్తుతం అరవై ఆరు మంది మంత్రులున్నారు. ఈ సంఖ్యను 83 వరకు పెంచుకోవచ్చు. ప్రస్తుతం నాలుగైదు ఖాళీలున్నాయి. క్రీడల మంత్రి శర్వానంద సోనోవాల్ అసోం ముఖ్యమంత్రి పదని చేపట్టారు. మరో కేంద్రమంత్రి రావు సాహిబ్ పాటిల్ మహారాష్ట్ర బిజెపి అధ్యక్షుడుగా వెళ్ళారు. వీరి ఖాళీలను భర్తీ చేయటంతో పాటు వచ్చే ఏడాది ఎన్నికలు జరుగనున్న ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్ రాష్ట్రాలకు చెందిన కొందరిని మంత్రివర్గంలో చేర్చుకుంటారనే మాట వినిపిస్తోంది. యుపికి చెందిన యోగి ఆదిత్యనాథ్, సత్యపాల్ సింగ్, సాధ్వి సావిత్రి భాయి ఫూలే, ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి భగత్ సింగ్ కోషియారీ, అసోంకు చెందిన రామేశ్వర్ తేలి, పంజాబ్ నుండి నవజ్యోత్ సింగ్ సిద్దూ, ఆజయ్ టాంటాలకు మంత్రివర్గంలో అవకాశం లభించవచ్చునని అంటున్నారు.