జాతీయ వార్తలు

స్వల్పంగా తగ్గిన పెట్రో ధరలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 30: గత రెండు నెలల్లో మొదటి సారిగా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాయి. పెట్రోల్‌పై లీటరుకు 89 పైసలు, డీజిల్‌పై లీటరుకు 49 పైసలు తగ్గిస్తున్నట్టు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రకటించింది. తగ్గించిన ఈ ధరలు గురువారం అర్థరాత్రి నుంచే అమల్లోకి వచ్చాయి. వీటి ప్రకారం ఢిల్లీలో లీటరు పెట్రోలు రూ. 65.65 నుంచి 64.76 పైసలకు తగ్గింది. అలాగే డీజిల్ లీటరు రూ. 55.19 నుంచి 54.76కు తగ్గింది. ఈ రెండు నెలల కాలంలో మొత్తం పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. అంటే పెట్రోల్‌పై లీటరుకు రూ. 4.52 మేర, డీజిల్‌పై రూ 7.72 పైసలు పెరిగినట్టయింది. ఈ నేపథ్యంలోనే తాజాగా వీటి ధరలను తగ్గించడం గమనార్హం.