జాతీయ వార్తలు

వైకాపా పిటిషన్‌పై వచ్చేవారం విచారణ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 30: ఆంధ్రప్రదేశ్ శాసన సభ్యుల పార్టీ ఫిరాయింపులపై వైకాపా సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ వచ్చేవారం విచారణకు రానుంది. పార్టీ ఫిరాయింపులపై ఫిర్యాదు చేసినా అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు పట్టించుకోవడం లేదని, దాన్ని తక్షణం పరిష్కరించేలా ఆదేశించాలని వైకాపా తరపున ఆ పార్టీ లోక్‌సభాపక్ష నేత మేకపాటి రాజమోహన్ రెడ్డి సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. ఇది గురువారం సుప్రీం కోర్టు ముందుకొచ్చింది. జస్టిస్ అనిల్ ఆర్ దవే, జస్టిస్ లావు నాగేశ్వరరావులతో కూడిన ధర్మాసనం పిటిషన్‌ను విచారించింది. అయితే తమ తరపు సీనియర్ న్యాయవాది అందుబాటులో లేనందున వచ్చేవారానికి వాయిదా వేయాలని పిటిషనర్ తరపు న్యాయవాది పూజాధార్ విన్నవించారు. దీనిపై జస్టిస్ నాగేశ్వరరావు స్పందిస్తూ ఇది రాష్ట్రానికి చెందిన అంశం కాబట్టి హైకోర్టుకు వెళ్లొచ్చు కదా అన్నారు.