జాతీయ వార్తలు

రూ. 655 కోట్లతో ఐఐపిఇ ఏర్పాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూన్ 30: విశాఖ జిల్లా సబ్బవరం మండలంలో దాదాపు 655 కోట్ల రూపాయలతో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ (ఐఐపిఇ)ని ఏర్పాటు చేయనున్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచి ఎయులో ఇది తాత్కాలికంగా పని చేస్తుంది. మూడేళ్లపాటు ఐఐటి ఖరగ్‌పూర్‌ను ఐఐపిఇకి మెంటారింగ్ చేసేందుకు వీలుగా గురువారం ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ సంయుక్త కార్యదర్శి సుష్మ రథ్ మీడియాతో మాట్లాడుతూ ఇప్పటికే ఇందుకు సంబంధించిన ఫైల్ కేంద్ర ఆర్థిక శాఖ పరిశీలనలో ఉందని, ఈ నిధులను కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ ద్వారా కేటాయిస్తారని తెలిపారు. విశాఖ పరిసరాల్లో పెట్రోలియం సంస్థలు మరిన్ని ఏర్పాటు కానున్న నేపథ్యంలో ఇక్కడ ఐఐపిఇ ఏర్పాటు చేసేందుకు నిర్ణయించామన్నారు.
తాత్కాలికంగా ఎయులో పని చేస్తుందని, మూడేళ్లలో పూర్తి స్థాయి క్యాంపస్‌ను సబ్బవరంలో నిర్మించేందుకు లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ఈ విద్యా సంవత్సరంలో కేవలం బి.టెక్ కెమికల్, పెట్రోలియం ఇంజనీరింగ్ కోర్సులను ప్రారంభిస్తున్నామని తెలిపారు. ఒక్కో బ్రాంచ్‌లో 50 సీట్లు ఉంటాయని తెలిపారు. వచ్చే ఏడాది నుంచి రెండు పీజీ కోర్సులు ప్రారంభిస్తామని తెలిపారు. పీజీ కోర్సుల నిర్వహణకు అనువైన ప్రయోగశాలలు, పరికరాలు అందుబాటులో ఉండని కారణంగా, నాణ్యతను దృష్టిలో ఉంచుకుని వాటి ప్రారంభాన్ని వాయిదా వేసినట్లు తెలిపారు. ఇప్పటికి అధ్యాపకుల నియామకం దాదాపు పూర్తి అయిందని తెలిపారు.
చమురు రంగ పరిశ్రమల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ సంస్థను తీర్చిదిద్దుతున్నామని, పరిశోధనలకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. విశాఖ, చెన్నైల మధ్య పెట్రోకెమికల్ కాంప్లెక్సు నిర్మించనున్నామని, అయితే ఇది ఆంధ్రప్రదేశ్‌లోనే ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. అయితే ఎక్కడ ఏర్పాటు చేయాలన్న అంశంపై ఇంకా వివిధ అంశాలను పరిశీలిస్తున్నామని తెలిపారు.

చిత్రం..ఒప్పంద పత్రాలను చూపిస్తున్న కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ, ఐఐటి ఖరగ్‌పూర్ ప్రతినిధులు