జాతీయ వార్తలు

దేశంలో 91 శాతం మందికి ఆరోగ్య బీమా లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 30: దేశంలో 91 శాతం ప్రజలకు ఎటువంటి ఆరోగ్య బీమా లేదని హెచ్‌డిఎఫ్‌సి లైఫ్ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. ఈ వివరాలను ఆ సంస్ధ సీనియర్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ సంజయ్ త్రిపాఠీ తెలిపారు. భారతీయ ప్రజల మనోభావాలకు అనుగుణంగా ఆరోగ్య బీమా పథకాలను రూపొందించాల్సి ఉందన్నారు. ఎటువంటి పరిస్ధితుల్లో ఆరోగ్య బీమా కావాలనుకుంటారో, ఒక వేళ సవరణలు చేస్తే ఎటువంటి అదనపు అంశాలను స్కీంలో చేర్చాలనే దానిపై సమగ్రమైన వివరాలను ప్రజలకు అందించాల్సిన బాధ్యత ఆరోగ్య బీమా కంపెనీలపై ఉందన్నారు. అనేక మంది ప్రజలు ఆరోగ్య బీమా చేయించుకోకుండా క్లిష్టమైన సమయాల్లో తమ సేవింగ్స్‌ను మొత్తం ఆసుపత్రులకు ఖర్చుపెడుతున్నారన్నారు.