జాతీయ వార్తలు

రూ.1.5 లక్షల కోట్ల ఎల్‌ఐసి రుణంతో రైల్వేల అభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, జూన్ 30: దేశంలో రైల్వే రంగంలో వౌలిక వసతులు, నూతన రైల్వే మార్గాల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని దక్షిణ మధ్య రైల్వే (విజయవాడ డివిజన్) ఎడిఆర్‌ఎం వేణుగోపాల్ రావు అన్నారు. నెల్లూరు జిల్లా కేంద్రంలోని ప్రధాన రైల్వే స్టేషన్‌ను గురువారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలో రైల్వే సేవలను మరింత విస్తృత పరచేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. ఇందుకోసం ఇప్పటికే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్‌ఐసి) నుండి లక్షా యాభైకోట్ల రుణం తీసుకున్నట్లు వెల్లడించారు. దేశంలో 1252 ఆదర్శ రైల్వే స్టేషన్లు ఉన్నాయని, వీటిలో విజయవాడ డివిజన్‌కు పరిధిలో ఒంగోలు కూడా ఉందన్నారు. నెల్లూరు ప్రధాన రైల్వే స్టేషన్‌ను ఎ1 స్టేషన్‌గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామన్నారు. ఓబులాపురం-కృష్ణపట్నం ఓడరేవుకు నిర్మిస్తున్న 95కిలోమీటర్ల రైల్వే లైన్ వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామన్నారు. విజయవాడ-గూడూరు మధ్య 293 కిలోమీటర్ల మేర మూడో రైల్వే మార్గం ఏర్పాటుకు 2423కోట్లతో నీతి అయోగ్ ద్వారా ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. గూడూరు-దుగరాజపట్నం రైల్వే మార్గం ప్రతిపాదన దశలో ఉందన్నారు. నడికుడి-శ్రీకాళహస్తీ రైల్వే మార్గం నిర్మాణం కోసం మూడు దశల్లో టెండర్లు నిర్వహిస్తామన్నారు. ప్రతి రైల్వే స్టేషన్‌లో రక్షిత మంచినీటి ప్లాంట్ స్వల్ప ధరతో అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. మహిళా ప్రయాణికుల భద్రత కోసం నిర్భయ (పోక్సా) వంటి చట్టాలతో 138 టోల్‌ఫ్రీ నంబరు, 182 నంబర్‌తో సంక్షిప్త సందేశం (ఎస్‌ఎంఎస్) పంపే విధంగా చర్యలు తీసుకున్నామన్నారు. ఈ ఏడాది చివరికల్లా నెల్లూరు ప్రధాన స్టేషన్‌లో ఉచిత వైఫై సేవలు అందుబాటులోనికి రానున్నాయన్నారు. విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలో మెకనైజ్‌డ్ క్లీనింగ్ సిస్టమ్ (ఎంసిఎస్) సౌలభ్యం నెల్లూరులో మాత్రమే ఉందన్నారు. క్లీన్ మైకోచ్ విధానం ప్రకారం 58888 నెంబర్‌కు మెసేజ్ పంపితే వచ్చే స్టేషన్‌లో కోచ్ క్లీనింగ్ చేసే విధానాన్ని నూతనంగా ప్రవేశపెట్టామన్నారు.