జాతీయ వార్తలు

అమర్‌నాథ్ తీర్థయాత్ర ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్, జూలై 2: దక్షిణ కాశ్మీరు హిమాలయాల్లోని పరమ పవిత్ర అమర్‌నాథ్ పుణ్యక్షేత్రానికి వార్షిక తీర్థయాత్రలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తోపాటు జమ్మూ-కాశ్మీరు గవర్నర్ ఎన్‌ఎన్.వోహ్రా శనివారం భక్తులతో కలసి అమరేశ్వరునికి పూజలు నిర్వహించారు. 48 రోజులపాటు ఈ తీర్థయాత్రను నిర్వహించే అమర్‌నాథ్ దేవస్థాన బోర్డు (ఎస్‌ఎఎస్‌బి)కు చైర్మన్‌గా కూడా వ్యవహరిస్తున్న వోహ్రా హిమలింగానికి ‘ప్రథమ పూజ’ నిర్వహించగా, భక్తులతో కలసి రాజ్‌నాథ్ సింగ్ ఈ పూజలో పాల్గొన్నారని అధికారులు తెలిపారు. గత ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా తొలిరోజే అమర్‌నాథ్ పుణ్యక్షేత్రాన్ని సందర్శించారు. శుక్రవారం శ్రీనగర్‌కు చేరుకున్న రాజ్‌నాథ్ సింగ్ అధికారులతో ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించి యాత్రికుల భద్రతకోసం చేపట్టిన చర్యలను సమీక్షించారు.
బయల్దేరిన రెండో బృందం
జమ్మూలోని బేస్ క్యాంప్ నుంచి శనివారం 1,214 మంది భక్తులతో కూడిన రెండో బృందం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ అమర్‌నాథ్ పుణ్యక్షేత్రానికి బయలుదేరింది. ఈ బృందంలో 837 మంది పురుషులు, 227 మంది మహిళలు, మరో 150 మంది సాధువులు ఉన్నారని, వీరంతా శనివారం ఉదయం 5 గంటల 20 నిమిషాలకు భగవతి నగర్ బేస్ క్యాంప్ నుంచి 33 వాహనాల్లో అమర్‌నాథ్‌కు బయలుదేరారని పోలీసు అధికారి ఒకరు వెల్లడించారు. ఇప్పటికే జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిలోని పాట్నీటాప్ ప్రాంతాన్ని దాటిన ఈ బృందం శనివారం సాయంత్రానికి గమ్యస్థానానికి చేరుకుంటుందని ఆ అధికారి తెలిపారు. దీంతో జమ్మూ బేస్ క్యాంప్ నుంచి ఇప్పటివరకూ మొత్తం 2,496 మంది భక్తులు అమర్‌నాథ్ క్షేత్రానికి బయలుదేరినట్లయింది.

చిత్రం.. అమర్‌నాథ్ గుహలో ఏర్పడుతున్న మంచు శివలింగం