జాతీయ వార్తలు

ఉత్తరాఖండ్ అతలాకుతలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డెహ్రాడూన్, జూలై 2: కుండపోత వర్షాలవల్ల అనేక నదులు పొంగుపొర్లుతుండటంతో ఉత్తరాఖండ్ అతలాకుతలం అవుతోంది. సహాయక బృందాలు శిథిలాల కింది నుంచి మరో రెండు మృతదేహాలను వెలికితీయడంతో భారీవర్షాల కారణంగా మృతిచెందిన వారి సంఖ్య శనివారంనాటికి 14కు పెరిగింది. రాష్టవ్య్రాప్తంగా గల పది నదులు, ఇతర వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. కొండచరియలు విరిగిపడటం వల్ల అనేక మార్గాలలో వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. శుక్రవారం కురిసిన కుండపోత వర్షాల వల్ల పితోర్‌గఢ్, చమోలి జిల్లాల్లో గల్లంతయిన వారిలో 15 మంది ఆచూకీ ఇంకా లభించలేదు. దీంతో మృతుల సంఖ్య ఇంకా పెరుగుతుందనే భయాందోళనలు నెలకొన్నాయి. రాష్ట్రంలో అక్కడక్కడా ముఖ్యంగా నైనిటాల్, ఉధంసింగ్‌నగర్, చంపావత్ జిల్లాల్లో భారీవర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాష్ట్రానికి రానున్న 48 గంటలు ఎంతో కీలకమని పేర్కొంది. పితోరగఢ్ జిల్లాలో శిథిలాల కింది నుంచి శుక్రవారం రాత్రి తొమ్మిది మృతదేహాలను వెలికితీయగా, శనివారం ఉదయం మరో రెండింటిని వెలికితీసినట్లు ప్రభుత్వ అదనపు కార్యదర్శి సి.రవిశంకర్ పిటిఐ వార్తాసంస్థకు చెప్పారు. చమోలి జిల్లాలో అంతకుముందు మూడు మృతదేహాలను వెలికితీశారు. ఈ జిల్లాలో ఆరుగురి జాడ ఇంకా తెలియడం లేదని చెప్పారు. కుండపోత వర్షాల వల్ల ఆరు గ్రామాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
అరుణాచల్‌ప్రదేశ్‌లోని పశ్చిమ కామెంగ్ జిల్లా భలుక్‌పోంగ్ వద్ద ఎడతెరిపిలేని వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడటం వల్ల మృతిచెందిన వారి సంఖ్య శనివారం నాటికి 10కి పెరిగింది. శనివారం ఇక్కడ శిథిలాల నుంచి మరో అయిదు మృతదేహాలను వెలికితీశారు.
ముంబయిలో భారీ వర్షాలు
ముంబయి: ముంబయి మహానగరంలో గత 24 గంటల్లో భారీ వర్షాలు కురిశాయి. దీంతో సబర్బన్ రైళ్లు సుమారు 15 నిమిషాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. గత 24 గంటల్లో కొలాబా (దక్షిణ ముంబయి)లో 60.8 మిల్లీ మీటర్లు, శాంతాక్రజ్ (పశ్చిమ శివారు)లో రికార్డు స్థాయిలో 77 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదయినట్లు ముంబయిలోని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలిపింది. ముంబయి సహా మొత్తం కొంకణ్ ప్రాంతంలో రాగల 24 గంటల్లో భారీనుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.

చిత్రం.. పితోర్‌గఢ్ జిల్లాలో మట్టిపెళ్లలు విరిగిపడిన ప్రాంతంలో సహాయక చర్యలు చేపట్టిన సైనికులు