జాతీయ వార్తలు

ఇదా మీ పాలన!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాట్నా, జూన్ 15: వర్శిటీ విద్యార్థినులు ఎక్కడ ఎలాంటి లైంగిక వేధింపులు, దాడులను ఎదుర్కొన్నా తక్షణం నేరుగా రాజ్‌భవన్‌కు ఫిర్యాదు చేయవచ్చంటూ గవర్నర్ సత్యపాల్ మాలిక చేసిన వ్యాఖ్యలు బీహార్‌లో రాజకీయ మాటల యుద్ధానికి తెరతీశాయి. వివిధ వర్శిటీలకు చెందిన విద్యార్థి సంఘాలతో రాష్ట్ర వర్శిటీల చాన్స్‌లర్ హోదాలో గవర్నర్ మాలిక్ గురువారం నిర్వహించిన కార్యక్రమంలో ఈమేరకు విద్యార్థినులకు పిలుపునిచ్చారు. గవర్నర్ వ్యాఖ్యలను రాజకీయంగా మలచుకున్న విపక్ష ఆర్జేడీ నేతలు, జేడీ(యు)పై విరుచుకుపడ్డారు.
రాష్ట్రంలో మహిళలు, యువతులకు ఎంత గొప్ప భద్రత ఉందో గవర్నర్ వ్యాఖ్యలతో పూర్తిగా అర్థమైందంటూ విమర్శలకు దిగారు. గవర్నర్ వ్యాఖ్యలపై అసెంబ్లీలో విపక్ష నేత తేజస్వి యాదవ్ స్పందిస్తూ ‘రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎంత గొప్పగా ఉన్నాయో గవర్నర్ వ్యాఖ్యలు తేటతెల్లం చేస్తున్నాయి. అధికార పక్షానికి ఇంతకంటే అవమానం ఏముంటుంది?’ అంటూ వ్యాఖ్యానించారు. ‘్భయంకరమైన అవమానం. ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ పాలనలో శాంతిభద్రతలు ఏమాత్రం రక్షణలేని కంచెమధ్య ఉన్నాయన్న పరిస్థితి గవర్నర్ మాటలతో అర్థమైంది’ అంటూ ట్వీట్ చేశారు. హోంమంత్రిత్వ శాఖను తనవద్దే పెట్టుకున్నా, అవినీతిలో మునిగి తేలుతున్న ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌కు శాంత్రిభత్రదలపై దృష్టి పెట్టేంత తీరిక లేదంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చేతకాని ప్రభుత్వంపై నమ్మకం లేకే విద్యార్థినుల భద్రత బాధ్యతను గవర్నర్ తన చేతుల్లోకి తీసుకున్నారంటూ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఆర్జేడీ వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి నాయకత్వంలోని జేడీ(యూ) సైతం గట్టిగానే స్పందించింది.
ఆర్జేడీ నేతలు కువిమర్శలతో ఘనకార్యం సాధించినట్టు ఓవర్ యాక్షన్ చేస్తున్నారంటూ దాడి చేసింది. పదిహేనేళ్లు రాష్ట్రాన్ని పాలించిన ఆర్జేడీ బీహార్‌లోని శాంతి భద్రతల పరిస్థితిని అధ్వాన్నస్థితికి చేర్చారని దుయ్యబట్టింది. గవర్నర్ ప్రభుత్వంలో భాగమని, ఆయన ఆదేశాలు ప్రభుత్వ ఆదేశాలుగానే పరిగణించాలన్న విషయం ఆర్జేడీ నేతలకు తెలియకపోవడం సిగ్గుచేటని జేడీ(యూ) అధికార ప్రతినిధి, ఎమ్మెల్సీ నీరజ్ కుమార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.