జాతీయ వార్తలు

సింగరేణి వ్యాపార విస్తరణకు సహకరిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ సింగరేణి సంస్థ చేపడుతున్న నూతన ప్రాజెక్టులు,వ్యాపార విస్తరణకు కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలను అందిస్తుందని కేంద్ర రైల్వే, బొగ్గుగనుల శాఖ మంత్రి పీయూష్ గోయాల్ హామీ ఇచ్చారు.శుక్రవారం హైదరాబాద్ పర్యటనకు వచ్చిన మంత్రి సింగరేణి భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సింగరేణి సిఎండి శ్రీ్ధర్ సంస్థప్రగతిపై చేసిన పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్‌కు మంత్రి స్పందిస్తూ దేశ వ్యాప్తంగా సింగరేణి సంస్థ ప్రశంశలు అందుకోవడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.సింగరేణి సంస్థ 100 మిలియన్ల టన్నుల ఉత్పత్తితో పాటు కొత్త బొగ్గుగనులకు అనుమతులు ఇస్తామన్నారు. జాతీయ స్థాయిలో అత్యధికంగా బొగ్గు ఉత్పత్తి, రవాణా,ఓ.బి తొలగింపులో గణనీయమైన ప్రగతిని సాధించడం జరిగిందన్నారు.కోలిండియాలో కూడా లేని విధంగా కంపెనీలో కార్మికుల కోసం అమలు జరుగుతున్న సంక్షేమ పథకాల అమలుపై మంత్రి అభినంధించారు. సింగరేణి థర్మల్ ప్లాంట్‌లో 1200 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తితో పాటు నూతనంగా సౌర విద్యుత్‌పై సింగరేణి దృష్టిపెట్టడం జరిగిందన్నారు. సింగరేణిలో పర్యావరణ చర్యలను అభినందిస్తూ కార్మికులకు ఉచితంగా గ్యాస్ సిలిండర్లును పంపిణీ చేశారు.
వ్యాపార విస్తరణలో భాగంగా ఒడిశా,చత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో కొత్త బొగ్గు గనులు కేటాయించాలని సంస్థ సిఎండి శ్రీ్ధర్ మంత్రికి సూచించగా, అందుకు మం త్రి సానుకూలంగా స్పందిస్తూ తాము పూర్తిస్థాయిలో సహకరిస్తామన్నారు. తమ సంస్థ కార్యలయానికి విచ్చేసిన మంత్రికి సిఎండి ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో రాష్ట్ర ఇంధనశాఖ కార్యదర్శి అజయ్‌మిశ్రా, బొగ్గుశాఖ కార్యదర్శి ఆశిష్ ఉపాధ్యాయ, కేంద్ర మంత్రి ఓఎస్‌డి అమితాబ్ ప్రసాద్, సంస్థ డైరెక్టర్లు ఎస్ శంకర్, విజయభాస్కర్, చంద్రశేఖర్, కిషన్‌రావు, ఇడి డిఎన్ ప్రసాద్,, సురేంద్ర పాండే, ఆంథోని రాజా, సంస్థ సిపిఆర్‌ఓ జె నాగయ్య,సంస్థ పౌరసంబంధాల అధికారి మహేష్ పాల్గొన్నారు.

చిత్రం..సింగరేణి భవన్‌లో కేంద్ర రైల్వే, బొగ్గు గనుల శాఖ మంత్రి పీయూష్ గోయల్‌కు సంస్థ చేపట్టిన
ప్రగతిని వివరిస్తున్న సంస్థ సీఎండీ శ్రీ్ధర్