జాతీయ వార్తలు

ఢిల్లీలో తగ్గుతున్న వాతావరణ కాలుష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 16: ఢిల్లీ నగర వాతావరణంలో కాలుష్య స్థాయి శనివారం తగ్గినా, ప్రమాదకర స్థాయిలోనే ఇంకా కొనసాగుతోందని కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు పేర్కొంది. శనివారం ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ రీజియన్‌లో పిఎం 10 స్థాయిలో కాలుష్య స్థాయి 522, ఢిల్లీలో 529 నమోదైంది. బుధవారం ఎన్‌సిఆర్ ఢిల్లీలో కాలుష్య స్థాయి 778కి, ఢిల్లీలో 824 స్థాయి నమోదైంది. ఢిల్లీ మహానగరంలో నిర్మాణ రంగం పనులు ఆదివారం కూడా నిలిపివేస్తున్నారు. గాలి దుమ్ముతో కూడిన గాలుల వల్ల ఢిల్లీతో పాటు అనేక ప్రాంతాల్లో కాలుష్య స్థాయి పెరిగింది. కాగా అనంతరం స్థానికంగా గాలులు వీచడం వల్ల కాలుష్య స్థాయి తగ్గుముఖం పట్టినట్లు సైంటిస్టు గుఫ్రాన్ బేగ్ చెప్పారు. ఢిల్లీలో శుక్రవారం వాతావరణంలో కాలుష్య స్థాయి 124 నమోదైంది. రానున్న రోజుల్లో వాతావరణంలో కాలుష్యం గణనీయంగా తగ్గుముఖం పడుతుందని కాలుష్య నియంత్రణ బోర్డు పేర్కొంది.