జాతీయ వార్తలు

అపాయింట్‌మెంట్ ఇవ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, జూన్ 16: ప్రధానమంత్రి నరేంద్రమోదీని ఆదివారం కలిసేందుకు అపాయింట్‌మెంట్ కోరినట్లు కర్నాటక ముఖ్యమంత్రి కుమారస్వామి తెలిపారు. కావేరి నదీ జలాల యాజమాన్య అథారిటీ అంశంపై చర్చించనున్నట్లు ఆయన చెప్పారు. నీతి ఆయోగ్ సమావేశానికి హాజరయ్యేందుకు ఆయన ఢిల్లీకి వచ్చారు. కాగా ఆదివారం మధ్యాహ్నం 12.30 గంటలకు జలవనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలవనున్నట్లు ఆయన చెప్పారు. కావేరి నదీ జలాల యాజమాన్య బోర్డు స్థానంలో కావేరీ నదీజలాల నిర్ణయ అమలు కమిటీని ఏర్పాటు చేయాలని కర్నాటక మొదటి నుంచి కోరుతోంది.