జాతీయ వార్తలు

దేశమంతా కేజ్రీవాల్ వెనకే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ప్రతిపక్షానికి చెందిన నలుగురు ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, మమతా బెనర్జీ, కుమారస్వామి, విజయన్ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ బైజల్ నివాసంలో ధర్నా చేస్తున్న ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు మద్దతు తెలిపారు. నలుగురు సీఎంలు శనివారం రాత్రి కేజ్రీవాల్ నివాసానికి వెళ్లి ఆయన సతీమణి సునీతను కలిసి మద్దతు పలికారు. ఢిల్లీ ముఖ్యమంత్రి లెఫ్టినెంట్ గవర్నర్ నివాసంలో ధర్నా చేస్తుంటే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జోక్యం చేసుకోకపోవటం విచిత్రంగా ఉన్నదని ముఖ్యమంత్రులు విమర్శించారు. కేజ్రీవాల్ నివాసంలో నలుగురు ముఖ్యమంత్రులు విలేఖరుల సమావేశం ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ప్రజల సంక్షేమంకోసం కేంద్రం, రాష్ట్రం కలిసి పని చేయవలసిన అవసరం ఉన్నదని వారు స్పష్టం చేశారు. దేశమంతా కేజ్రీవాల్ వెనక ఉన్నదని విజయన్ చెప్పారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు తామంతా కట్టుబడి ఉన్నామని నలుగురు ముఖ్యమంత్రులు చెప్పారు. లెఫ్టినెంట్ గవర్నర్ అనీల్ బైజల్‌ను కలుసుకునేందుకు తాము చేసిన ప్రయత్నం ఫలించలేదని మమతా బెనర్జీ చెప్పారు. నలుగురు ముఖ్యమంత్రులం అడిగినా లెఫ్టినెంట్ గవర్నర్ అప్పాయింట్‌మెంట్ ఇవ్వలేదని వారు చెప్పారు. కేజ్రీవాల్‌ను కలిసేందుకు అనుమతి ఇవ్వకపోవటం అన్యాయమని చంద్రబాబు విమర్శించారు.
తొలగని ప్రతిష్టంభన
దేశ రాజధాని ఢిల్లీలో ఆరోరోజు శనివారం ప్రతిష్టంభన కొనసాగుతోంది. ముఖ్యమంత్రి కేజ్రీవాల్, ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, మంత్రులు సత్యేందర్ జైన్, గోపాల్‌రాయ్ నిరసన కార్యక్రమం కొనసాగుతోంది. లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ ఆఫీసు వెయిటింగ్ రూమ్‌లో సీఎం, ముఖ్యమంత్రులు బైఠాయించే ఉన్నారు. ఐఏఎస్ అధికారుల సమ్మె విరమింపచేయాలని, రేషన్ పంపిణీ పథకానికి ఆమోదం తెలపాలని కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. ఢిల్లీలో రాష్టప్రతి పాలన సాగుతోందని, ప్రజాస్వామ్యం మంటగలుపుతున్నారని ఆయన తీవ్రంగా ఆరోపించారు. ప్రజాసమస్యలపై కేబినెట్ మంత్రులు ఆందోళన చేస్తున్నా కేంద్రం పట్టించుకోకపోవడంపై సీఎం నిప్పులు చెరిగారు. ‘ఐఏఎస్‌ల సమ్మె వ్యవహారం చూస్తే ఢిల్లీలో రాష్టప్రతి పాలన తరహా ప్రభుత్వం పనిచేస్తున్నట్టుంది’ అని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. అంతటితో ఆగక ‘ప్రధాని నరేంద్ర మోదీ అధికారులతో కలిసి ఆఫీసులో పనిచేసుకోవాలి. మీటింగ్‌లకు వెళ్లడం కాదు’ అని అన్నారు. శుక్రవారం మోదీకి కేజ్రీవాల్ ఓ లేఖ రాస్తూ ఐఏఎస్‌ల సమ్మె విరమింపచేయాలని కోరు. ఆదివారం జరిగే నీతీ ఆయోగ్ మీటింగ్‌కు హాజరుకావల్సి ఉందని, ఈలోగానే ఐఏఎస్‌లతో సమ్మె ఉపసంహరింపచేయాలని డిమాండ్ చేశారు. మరోపక్క డిప్యూటీ సీఎం సిసోడియా, జైన్‌లు లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫీసులోనే ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని సిసోడియా డిమాండ్ చేశారు. శుక్రవారం ఓ వీడియా క్లిప్పింగ్ విడుదల చేస్తూ ‘లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫీసు నుంచి బయటకు పంపితే పచ్చి మంచినీళ్లు తాగబోం’ అని హెచ్చరించారు.
ఈ సంక్లిష్ట పరిస్థితుల్లో ఆఫీసుకు వచ్చే పరిస్థితి లేకపోవడంతో లెఫ్టినెంట్ గవర్నర్ బైజాల్ తన ఇంటి నుంచే అధికారిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఐఏఎస్‌లు సమ్మె విరమించి విధులకు హాజరయ్యేలా బైజాల్‌ను ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్‌పై విచారణకు హైకోర్టు అంగీకరించింది. ఈ నెల 18న పిటిషన్‌ను విచారించనుంది. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫీసులో బైఠాయింపును సవాల్ చేస్తూ దాఖలైన మరో పిటిషన్ కూడా 18న విచారణకు రానుంది.
చిత్రాలు..లెఫ్టినెంట్ గవర్నర్ నివాసంలో ఆరు రోజులుగా నిరసన దీక్ష చేస్తున్న ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను కలిసిన ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, ఇతర ఆప్ నాయకులు...
*ఢిల్లీలో శనివారం కేజ్రీవాల్‌కు సంఘీభావం తెలుపుతున్న ముఖ్యమంత్రులు పినరయ విజయన్, చంద్రబాబు, మమతా బెనర్జీ