జాతీయ వార్తలు

కేంద్రంపై విపక్షాల ఉమ్మడి దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 17: ఆదివారం జరిగిన నీతిఆయోగ్ సమావేశంలోవిపక్షాలన్నీ ఏకమైనట్టు స్పష్టంగా కనిపించింది. ముఖ్యంగా బీజేపీ యేతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు అంతా ఒక్కటయ్యారు. కేంద్రం సహకార సమాఖ్య వ్యవస్థను అనుసరించాలని, రాష్ట్రాల వ్యవహారల్లో అనవసరంగా కేంద్రం జోక్యం తగదని వారు కోరారు. 15వ ఆర్థిక సంఘం నివేదిక, కేంద్ర నిధుల పంపిణీ, వంటి అంశాలపై ఈ ముఖ్యమంత్రులు ఎన్‌డీఏ ప్రభుత్వంపై దాడికి దిగారు. కేంద్రం రాజ్యాంగంలోని సమాఖ్య వ్యవస్థను బలహీన పరుస్తున్నదని ఆరోపించారు. ‘రాష్ట్రాల సమస్యలు కేంద్రానికి తెలుసా? ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క సమస్య ఉన్నది. కేంద్రం విధానాలను నిర్ణయిస్తుంది. కానీ వాటిని అమలు పరచేది రాష్ట్రాలు మాత్రమే. అందువల్ల కేంద్రం సహకార సమాఖ్య స్ఫూర్తిని అనుసరిస్తూ అనవసరంగా రాష్ట్రాల వ్యవహారాల్లో తలదూర్చకూడదు’ అని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. రైతులు రుణమాఫీ అంశాన్ని ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక ముఖ్యమంత్రులు లేవనెత్తారు. కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్‌డి కుమారస్వామి, రైతులు రుణ మాఫీ పథకం అమలు జరపడానికి కేంద్రం నుంచి 50 శాతం నిధులు అవసరమన్నారు. కర్ణాటకలో 85 లక్షల మంది రైతుల బకాయిలు వసూలు కాలేదు. అతివృష్టి, అనావృష్టుల కారణంగా రైతులు తీవ్ర నష్టాల్లో కూరుకుపోయినందువల్ల వారికి రుణ మాఫీ వర్తింప జేయాలన్నారు. ఇందుకోసం అయ్యే మొత్తం ఖర్చులో 50 శాతం కేంద్రం భరించాలని కోరారు. 15వ ఆర్థిక సంఘం విషయంలో కేంద్రం ప్రస్తుత నిబంధనల్లో మార్పులు చేపట్టాలని డిమాండ్ చేశారు.