జాతీయ వార్తలు

కాశ్మీర్ అంశంలో కేంద్రం వైఫల్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూ ఢిల్లీ, జూన్ 17: కాశ్మీర్ శాంతి భద్రతలను నెలకొల్పడంలో ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వం విఫలమైందని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. ప్రధాని మోదీ విదేశీ ప్రయాణాలతో కాలక్షేపం చేశారని పేర్కొంది. కాశ్మీర్‌పై మొదటిసారిగా ఐక్యరాజ్యసమితి నివేదిక విడుదల చేసిందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి పవన్ ఖేరా ధ్వజమెత్తారు. ఈ నెల 28వ తేదీ నుంచి ప్రారంభమయ్యే అమర్‌నాథ్ యాత్ర సాఫీగా జరిగేటట్లు చర్యలు తీసుకోవాలని ఆయన కేంద్రాన్నికోరారు. ఈ యాత్ర సందర్భంగా భక్తులకు కల్పించే భద్రతా చర్యలపై ప్రభుత్వం ప్రకటన చేయాలన్నారు. ఆదివారం ఇక్కడ ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ, కాశ్మీర్ అంశంపై అఖిల పక్ష సమావేశం కోసం కాంగ్రెస్ పార్టీ నాలుగేళ్లుగా ఎదురుచూస్తోందన్నారు. కాశ్మీర్‌ను మతపరమైన రాజకీయాలకు ప్రయోగశాలగా కేంద్రం మార్చివేసిందన్నారు. కాశ్మీర్ అంశంలో కేంద్రం ఘోరంగా విఫలమైందన్నారు. అంతరంగిక విధానం, విదేశాంగ విధానం రెండింటిలో కేంద్రం తీసుకున్న చర్యలు విఫలమయ్యాయన్నారు. 1990కంటే అధ్వాన్న పరిస్థితులు కాశ్మీర్‌లో నెలకొన్నాయన్నారు. శాంతి భద్రతల సమస్యల వల్ల అనంతనాగ్ లోక్‌సభ ఉప ఎన్నికను కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహించలేకపోతోందన్నారు. యుపిఏ హయాంలో లోక్‌సభ ఎన్నికలో 71 శాతం పోలింగ్ అయిందన్నారు. కాని ఇటీవల కాశ్మీర్ ఉప ఎన్నికలో కేవలం ఏడు శాతం ఓట్లే పోలయ్యాయన్నార. మోడీ ప్రభుత్వ వైఫల్యాల్లో కాశ్మీర్ అంశం ప్రథమ స్థానంలో నిలుస్తుందన్నారు.
గత 27 రోజుల్లో మునుపెన్నడూ లేని విధంగా 57 పెద్ద దాడులు కాశ్మీర్‌లో చోటు చేసుకున్నాయన్నారు. ఇంతకాలం ప్రపంచం కాశ్మీర్‌ను భూభాగ వివాదంగా చూసేదన్నారు. కాని ప్రధాని మోదీ అనుసరిస్తున్న విధానం వల్ల కాశ్మీర్ మతపరమైన వివాదంగా మారిందన్నారు. కథువాలో ముస్లిం తెగకు చెందిన ఒక బాలికపై సామూహిక అత్యాచారం ఘటన దేశాన్ని కుదిపేసిందన్నారు. అధికారంలో ఉన్న నేతల తీరు వల్ల ఈ అంశం మతం రంగు పులుముకుందన్నారు. ఐక్యరాజ్యసమితి నివేదికను ఏకపక్ష వైఖరితో విడుదల చేశారని ప్రకటన చేసి ప్రధాని మోదీ చేతులు దులుపుకున్నారన్నారు. విదేశీ పర్యటనలను తరచుగా చేయడం వల్ల సాధించిదేముందన్నారు. దేశానికి చేకూరిన ప్రయోజనం ఏమిటో తెలియదన్నారు. స్వతంత్ర భారత చరిత్రలో ఐక్యరాజ్యసమితి కాశ్మీర్ అంశంపై ఎప్పుడూ నివేదిక విడుదలచేసేందుకు సాహసం చేయలేదన్నారు. ఐక్యరాజ్యసమితి నివేదిక వల్ల భారత్ ఆత్మరక్షణలో పడిందని, దీనికి మోదీ ప్రభుత్వం అనుసరించిన తీరే కారణమన్నారు. ఈ తరహా నివేదిక వెలువడేందుకు మోదీ చర్యలేక కారణమన్నారు. ఇంత కంటే మరో నేరం మరొకటి ఉందా అని కాంగ్రెస్ ప్రశ్నించింది. తక్షణమే కాశ్మీర్ అంశంపై చర్చించేందుకు అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ఆయన కోరారు.