జాతీయ వార్తలు

ఆరోగ్య బీమా.. లోపాల పుట్ట!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 17: కేంద్రం ప్రవేశపెట్టిన ఆరోగ్య బీమా పరిరక్షం పథకంలో లోపాలు ఉన్నాయని, నిర్వహణలో లోటుపాట్లు ఉన్నాయని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) పేర్కొంది. వివిధ రోగాలు, వ్యాధులు నయం చేసేందుకు కేంద్రం ఈ స్కీం కింద నిర్దేశించిన ధరలు చాలా తక్కువగా ఉన్నాయన్నారు. ఈ నిబంధనలు ఆచరణ యోగ్యంగా లేవన్నారు. ఒక వ్యాధి నయమయ్యేందుకు అయ్యే మొత్తం సొమ్ములో 30 శాతం సొమ్మును కూడా కవర్ చేసే విధంగా బీమా పథకం లేదని ఐఎంఏ జాతీయాధ్యక్షుడు డాక్టర్ రవి వాంకేడ్కర్ పేర్కొన్నారు. ఏ ఆసుపత్రి కూడా బీమా పథకం కింద నిర్దేశించిన రేట్లకు వైద్యాన్ని అందించలేదన్నారు. ఈ రేట్లకు రోగులకు నాణ్యమైన వైద్యాన్ని ఆసుపత్రులు అందించలేవన్నారు. ప్రతి రోగం లేదా వ్యాధి నయమయ్యేందుకు నిర్దేశించిన సొమ్ము వివరాలను వెబ్‌సైట్లలో లేదా ప్రజలకు చేసే మార్గంలో ఉంచాలన్నారు. ప్రభుత్వం ఈ విషయంలో పారదర్శకంగా వ్యవహరించాలన్నారు. ఆయుష్మాన్ భారత్ జాతీయ ఆరోగ్య బీమా పథకం కింద కేటాయించిన సొమ్ము కింద దేశంలో ప్రతి జిల్లా ఆసుపత్రికి రూ.2 కోట్లను మంజూరు చేసి వైద్య వౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయాలన్నారు. ఈ బీమా అమలుకు కేటాయించిన నిధులతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో సౌకర్యాలను మెరుగుపరిచి ప్రజలకు చౌకగా వైద్య సేవలు అందించాలన్నారు. ప్రభుత్వ రంగంలో ఆసుపత్రులను ఏర్పాటు చేయకుండా ఆరోగ్య బీమా కంపెనీలకు రూ.400 కోట్ల మేర నిధులు చెల్లించే పరిస్థితి తలెత్తుతుందన్నారు. బీమా ఆధారంగా వైద్య సేవలు అందించే విధానం సత్ఫలితాలు ఇవ్వదన్నారు. అనేక లోపాలు ఉన్న ఈ స్కీం వల్ల నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోలేమన్నారు. ఎన్నికలసంవత్సరంలో మాత్రం ప్రభుత్వం వైద్య సేవలను అందించే విషయమై మంచి స్కీంను మాత్రం తెచ్చిన పేరు వస్తుందన్నారు. ఈ స్కీం అమలుకు రూ.1.5 లక్షల కోట్ల నిధులు అవసరమని, కాని కేంద్రం నిధులు స్వల్పంగా విడుదల చేసిందన్నారు. ఉన్నత ప్రమాణాల్లో వైద్య సేవలు అందించాలంటే ప్రభుత్వ ఆసుపత్రులను అభివృద్ధి చేయాలన్నారు. వైద్యసేవలకు ఉద్దేశించిన ఈ స్కీం వల్ల బీమా వ్యాపారం బాగుపడుతుందన్నారు. వైద్య సేవలపై నేరుగా ఆసుపత్రులతో సంబంధాలు పెట్టుకోవడం మంచిదని, బీమా కంపెనీల పాత్రను తొలగించాలన్నారు. నిర్దేశించిన బడ్జెట్‌లో 40 శాతం నిధులు బీమా కంపెనీలు మింగేస్తాయని, పైగా అనైతిక విధానాలకు ఆస్కారం ఇచ్చినట్లవుతుందని ఐఎంఏ సెక్రటరీ జనరల్ డాక్టర్ ఆర్‌ఎన్ టాండన్ అన్నారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖతో ఆరోగ్య బీమా అమలుపై ఇంతవరకు 20 రాష్ట్రాలు ఒప్పందాలు ఖరారు చేశాయి.