జాతీయ వార్తలు

చెత్తతో నిండిపోతున్న ఎవరెస్టు శిఖరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాఠ్మండు, జూన్ 17: ప్రపంచంలోనే అత్యునత శిఖరం వౌంట్ ఎవరెస్ట్ పెద్ద డంపింగ్ యార్డ్‌గా మారిపోతోంది. దశాబ్దాలుగా ఔత్సాహికులు వౌంట్ ఎవరెస్ట్‌ను అధిరోహించడంపైనే ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తున్నారు. ఇదే సమయంలో తమతో తెచ్చుకున్న వివిధ పదార్థాలను ఇక్కడ విచ్చలవిడిగా పారవేస్తుండటంతో ఎవరెస్ట్ పెద్ద డంపింగ్ యార్డుగా మారిపోతున్నది. ముఖ్యంగా ఫ్లోరోసెంట్ టెంట్లు, ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడానికి అవసరమైన పరికరాలు, గ్యాస్ డబ్బాలు, మానవ విసర్జితాలతో 8,848 మీటర్ల ఎత్తున్న ఈ మార్గం నిండిపోయింది. ‘ఇది చాలా రోతగా తయారైంది’ అని 18సార్లు ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కిన పెంమా డోర్జీ షెర్పా అన్నాడు. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించేవారి సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తుండటంతో పరిస్థితి మరింత దిగజారుతోంది. కేవలం ఈ ఏడాది 600 మంది ఈ శిఖరాన్ని అధిరోహించారు. ఇక భూతాపం కారణంగా కరుగుతున్న హిమానీనదాలు ఈ చెత్తతో నిండిపోతున్నాయి. అయితే సమస్య తీవ్రతను గుర్తించిన నేపాల్ ఐదేళ్ల క్రితమే కొన్ని చర్యలకు ఉపక్రమించింది. దీని ప్రకారం ఒక్కొక్క పర్వతారోహక టీం ముందుగా 4వేల డాలర్ల మొత్తాన్ని డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. టీంలోని ప్రతి పర్వతారోహకుడు కనీసం ఎనిమిది కిలోలకు తగ్గకుండా వ్యర్థాలను తనతో తీసుకు వస్తేనే ఆ మొత్తాన్ని తిరిగి ఇచ్చివేస్తున్నారు. టిబెట్ వైపున కూడా ఇదే మాదిరి నిబంధన విధించారు. దీని ప్రకారం ప్రతి పర్వతారోహకుడు కనీసం 8 కిలోల వ్యర్థాన్ని తీసుకురావాలి. లేని పక్షంలో కిలోకు 100 అమెరికన్ డాలర్ల చొప్పున ఫైన్ విధిస్తున్నారు. 2017లో నేపాల్‌వైపు పర్వతారోహకుల బృందాలు మ్తొతం 25 టన్నుల వ్యర్థాన్ని 15 టన్నుల మానవ వ్యర్థాలను తిరిగి తీసుకొచ్చినట్టు సాగరమాత కాలుష్య నియంత్రణ కమిటీ వెల్లడించింది. ఇంత జరుగుతున్నా ఇంకా పెద్ద మొత్తంలో వ్యర్థాలను పర్వతంపై వదులుతూనే ఉన్నారు. ముఖ్యంగా ఎంతో కొంత అధికార్లకు ముట్ట చెబితే వారు చూసీ చూడనట్టు ఉండటమే ఇందుకు ప్రధాన కారణం. గత రెండు దశాబ్దాలనుంచి ఎవరెస్ట్ బిజినెస్ ఊపందుకోవడం, సరికొత్త సమస్యలకు దారితీస్తోంది. ముఖ్యంగా పర్వతారోహకుల సంఖ్య బాగా పెరిగిపోవడం, తక్కువ ఖర్చుతో ఎవరెస్ట్‌ను అధిరోహింపజేస్తామంటూ కొందరు ఆపరేటర్ల ప్రచారం కారణంగా, కొత్తవారు ఈవైపునకు ఆకర్షితులవుతున్నారు. ఈ అనుభవం లేనివారివల్ల ఈ చెత్త సమస్య మరింత పెరిగిపోతున్నదని రెండు దశాబ్దాలుగా ఎవరెస్ట్‌ను అధిరోహిస్తున్న డామియన్ బెనెగాస్ హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆపరేటర్లు మరింత ఎక్కువమంది అధిక ఎత్తు ప్రదేశాలను ఎక్కడంలో అనుభవం ఉన్నవారిని నియమించి, తమ క్లైంట్ల సామాన్లు, చెత్తను జాగ్రత్తగా కిందికి తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఇదిలావుండగా ఎవరెస్ట్ వద్ద పెరిగిపోతున్న కాలుష్యం కశ్మీర్ లోయలో నీటి ఎద్దడికి కారణమవుతున్నదని పర్యావరణ వేత్తలు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం బేస్ క్యాంపునుంచి మురికిని గంటనడక దూరంలో ఉన్న గ్రామం సమీపంలోని కందకాల్లో పారబోస్తున్నారు. ఇది వర్షాకాలంలో వరద నీటితో కలిసి దిగువ ప్రాంతాలకు చేరుతోంది. ఈ నేపథ్యంలో బేస్ క్యాంపు సమీపంలో బయోగ్యాస్ ప్లాంటును ఏర్పాటు చేయాలన్న అంశం పరిశీలనలో ఉంది. ఇది కార్యరూపం దాలిస్తే వ్యర్థాల సమస్యకు చాలావరకు పరిష్కారం లభించగలదు.