జాతీయ వార్తలు

ఐఎఎస్‌లను వేధిస్తున్న ఆమ్ ఆద్మీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూ ఢిల్లీ, జూన్ 17: ఢిల్లీలో ఆమ్ ఆద్మీ ప్రభుత్వం ఐఎఎస్ అధికారులను లక్ష్యంగా చేసుకుని వేధిస్తోందని ఢిల్లీ ఐఎఎస్ అధికారుల సంఘం విమర్శించింది. ఆదివారం ఇక్కడ రెవెన్యూ కార్యిదర్శి మనీషా సక్సేనా, రవాణా శాఖ కమిషనర్ వర్ష జోషి, దక్షిణ ఢిల్లీ మెజిస్ట్రేట్ అంజాద్ తక్, సమాచారశాఖ కార్యదర్శి జాదవ్ సారంగి మాట్లాడుతూ ఢిల్లీ రాష్ట్రానికి చెందిన ఐఎఎస్ అధికారులు నిజాయితీ, అంకితభావంతో పనిచేస్తున్నారన్నారు. రాజకీయాలకు అతీతంగా, తటస్థంగా పనిచేస్తున్నామన్నారు. రాష్ట్రం రూపొందించిన సంక్షేమ పథకాలను, విధానాలను అమలు చేయడమే తమ కర్తవ్యమన్నారు. తాము చట్టానికి, రాజ్యాంగానికి మాత్రమే జవాబుదారీ అని వారు తెలిపారు. తాము సమ్మెలో లేమని వారు స్పష్టం చేశారు. గత సోమవారం నుంచి లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫీసు వద్ద ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఇతర మంత్రులు బైఠాయించారు. ఐఎఎస్ అధికారుల చేత సమ్మెను విరమింపచేయాలని ఆమ్ ఆద్మీ ప్రభుత్వం లెఫ్టినెంట్ గవర్నర్‌ను డిమాండ్ చేసింది. ఐఎఎస్ అధికారులంతా పనిచేస్తున్నారని, ప్రతి రోజూ విధులకు హాజరవుతున్నారని, అంకిత భావంతో పనిచేస్తున్నారని ఐఎఎస్ అధికారులు తెలిపారు. అసాధారణ పరిస్థితులు తలెత్తడంతో తాము విలేఖర్ల సమావేశాన్ని ఏర్పాటు చేసి తమ సమస్యలను ప్రజల దృష్టికి తెస్తున్నామన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేల ఫోన్ కాల్స్‌ను ఐఎఎస్ అధికారులు స్వీకరించడం లేదన్న అభియోగంలో నిజం లేదన్నారు. అందరి ఫోన్ కాల్స్‌కు అధికారులకు స్పందిస్తున్నారన్నారు. తాము ఏ రాజకీయ పార్టీకి వ్యతిరేకం కాదని, అలాగే మద్దతు కూడా ఇవ్వమని చెప్పారు. రాజ్యాంగం, చట్టానికి లోబడి పనిచేస్తున్నామన్నారు. తమ ప్రాణాలకు క్షేమం కాని సమావేశాలకు హాజరు కామని వారు చెప్పారు. ఈ ఏడాది ఫిబ్రవరి 19వ తేదీన కేజ్రీవాలా ఇంటి వద్ద జరిగిన సమావేశంలో కొంత మంది ఆమ్ ఆద్మీ ఎమ్మెల్యేలు ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అన్షూ ప్రకాశ్‌పై దాడి చేసిన విషయం విదితమే.

చిత్రం..ఢిల్లీలో ఆదివారం విలేఖరులతో మాట్లాడుతున్న ఐఏఎస్ అధికారుల సంఘం నేతలు