జాతీయ వార్తలు

నియంతల్లా మోదీ, ఫడ్నవిస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూన్ 29: మహారాష్టల్రోని నానర్ రిఫైనరీ ప్రాజెక్టు విషయంలో అటు ప్రధాని నరేంద్రమోదీ, ఇటు ముఖ్యమంత్రి ఫడ్నవిస్ అనుసరిస్తున్న వైఖరి నియంతలను గుర్తుకు తెస్తోందని, అటువంటి వారు ఎమర్జన్సీకి వ్యతిరేకంగా విమర్శలు చేసే హక్కు ఏ మాత్రం లేదని శివసేన విమర్శించింది. పార్టీకి చెందిన సామ్నా తాజా సంచికలో ఈ మేరకు కేంద్ర, రాష్ట్రాల వైఖరిపై విరుచుకుపడింది. 44 యూఎస్ బిలియన్ డాలర్ల వ్యయంతో మహారాష్టల్రోని రత్నగిరిలో నిర్మించనున్న నానర్ రిఫైనరీ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తే, అది కేన్సర్ ఆసుపత్రికి చేసిన శంకుస్థాపనగా భావించాల్సి వస్తుందని శివసేన ఆరోపించింది. ఈ ప్రమాదకరమైన ప్రాజెక్టు వల్ల ప్రజలు కేన్సర్, టీబీ, ఇతర ఛాతి వ్యాధుల బారిన పడే ప్రమాదముందని పేర్కొంది. ప్రజల అభ్యంతరాలను తోసిపుచ్చి ఈ ప్రాజెక్టును కనుక నిర్మిస్తే అది మరో ఎమర్జన్సీయే అవుతుందని అంది. మోదీ ప్రభుత్వం వెంటనే పర్యావరణ శాఖను రద్దు చేయాలని శివసేన డిమాండ్ చేసింది. పర్యావరణ రక్షణకు ఒకవైపు ప్రకృతి ప్రేమికులు తమ వంతు కృషి చేస్తుండగా, కేంద్రం మాత్రం ఇలాంటి విషపూరితమైన ప్రాజెక్టులను తీసుకువచ్చి పర్యావరణ నాశనానికి పూనుకుంటోందని విమర్శించింది. ఈ ప్రాజెక్టు ద్వారా ఎకోసిస్టమ్ పాడవ్వడమే కాక, ఆ ప్రాంత పంటలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని శివసేన చెప్పింది. మోదీ, ఫడ్నవిస్‌లు నియంతలుగా మారాలనుకుంటే 43 సంవత్సరాల క్రితం జరిగిన ఎమర్జన్సీపై వారు విమర్శలు చేయడం బూటకంగా భావించాల్సి వస్తుందని అన్నారు. జర్మనీ నియంత హిట్లర్ లక్షలాది మంది యూదులను గ్యాస్ చాంబర్‌లో వేసి హతమార్చిన విధంగానే నానర్ ప్రాజెక్టుతో కేంద్రం, రాష్ట్రం వేలాది మంది ప్రజలను చంపడానికి, వారి ఆస్తులను, పొలాలను నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నాయని విమర్శించింది. ఈ ప్రాజెక్టుపై అనేకగ్రామాల ప్రజలు తమ నిరసన వ్యక్తం చేస్తూ మహారాష్ట్ర ముఖ్యమంత్రికి వినతులు ఇచ్చారని, మెజారిటీ ప్రజల మనోభావాలను గౌరవించకపోతే అది నియంతృత్వమే అవుతుందని వ్యాఖ్యానించింది. పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఢిల్లీలో కూర్చుని ఫైళ్లపై సంతకాలు చేసి, తర్వాత ముంబయి వచ్చి సహకారం కోరడం నమ్మకద్రోహమేనని అన్నారు. మోదీకి ప్రాణహాని ఉందని నివేదికలు వచ్చిన నేపథ్యంలో ఆయనను దర్శించుకోవడానికి వచ్చేవారికి కఠిన నిబంధనలు విధించడంపై శివసేన నాటర్ ప్రజలను ప్రభుత్వం పురుగుల్లా చూస్తోందని విమర్శించింది.