జాతీయ వార్తలు

ఇక క్షణాల్లో.. మిస్సింగ్ పిల్లల ఆచూకీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 29: తప్పిపోయిన, అనాధ పిల్లల సమాచారం ఇక సులభంగా తెసుకోవచ్చు. దీనికి సంబంధించి ఓ మొబైల్ యాప్‌ను కేంద్ర వాణిజ్య మంత్రి సురేష్ ప్రభు, నోబెల్ అవార్డు గ్రహీత కైలాష్ సత్యార్థి శుక్రవారం ఇక్కడ ఆవిష్కరించారు. ఈ యాప్‌కు ‘రీ యునైట్’ అని నామకరణం చేశారు. బచపన్ బచావో ఆందోళన్, ఐటీ దిగ్గజం కేప్‌జెమినీ సంయుక్తంగా రీ యునైట్ యాప్‌ను రూపొందించాయి. బజపన్ బచావో ఎన్జీవో సత్యార్థి నేతృత్వంలో పనిచేస్తోంది. పిల్లలు తప్పిపోతే వారి తల్లిదండ్రులు పడుతున్న బాధలు వర్ణనాతీతమని, వారికి అలాంటి కష్టాల నుంచి తప్పించాలన్న ఉద్దేశంతోనే యాప్ రూపొందించడం జరిగిందని నోబెల్ శాంతి అవార్డు గ్రహీత వెల్లడించారు. తప్పిపోయిన పిల్లలను వారి తల్లిదండ్రుల వద్దకు చేర్చడానికి కైలాష్ సత్యార్థి పడ్డ తపన అంతాఇంతాకాదని కేంద్ర మంత్రి సురేష్ ప్రభు ప్రశంసించారు. వీధి బాలలు, అనాధ పిల్లల కోసం బచపన్ బచావో ఆందోళన చేస్తున్న కృషిని ఆయనీ సందర్భంగా గుర్తుచేశారు. అమేజాన్ వెబ్ సర్వీస్ ఆధారంగా రీ యునిట్ యాప్ పనిచేస్తుంది. ఫేస్ రికగ్నైజింగ్ టెక్నాలజీని ద్వారా తప్పిపోయిన పిల్లల ఫొటోను డేటాబేస్ చేసి ఫలితాలు రాబడతారు. మిస్సయిన పిల్లలకు సంబధించి ఢిల్లీ పోలీసుల డేటాబేస్‌కు రీ యునైట్ యాప్‌ను సంధానం చేస్తారు. తప్పిపోయిన పిల్లల ఫొటోలు అప్‌లోడ్ చేసుకునే సదుపాయం ఈ యాప్‌లో ఉందని మంత్రి సురేష్ ప్రభు వెల్లడించారు. దేశంలో ఏటా 44వేల మంది పిల్లలు తప్పిపోతున్నారు. అందులో 11వేల మంది ఆచూకీ మాత్రమే దొరుకుతోంది. బిడ్డలను పోగొట్టుకునే పిల్లల గురించి సమాచారం, వారికి కన్నవారి దగ్గరకు చేర్చడానికీ రీ యునైట్ యాప్ దోహదపడుతుందని కేప్‌జెమినీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అశ్విన్ యార్డీ స్పష్టం చేశారు.