జాతీయ వార్తలు

సుప్రీం కోర్టులో ‘నిఖా హలాల’ను వ్యతిరేకిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూ ఢిల్లీ, జూన్ 29: సుప్రీంకోర్టులో నిఖా హలాల, బహుభార్యాత్వం అంశాల కేసు విచారణకు వస్తే వ్యతిరేకిస్తామని కేంద్ర న్యాయ మంత్రిత్వశాఖ వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది మార్చి నెలలో సుప్రీంకోర్టు ముస్లింలలో పెళ్లికి సంబంధించి ఉండే పైన పేర్కొన్న రెండు మత పద్దతులపై స్పందించాలని కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. ఈ కేసు త్వరలో సుప్రీంకోర్టులో విచారణకు వచ్చే అవకాశం ఉంది. నిఖా హలాల అంటే ఒక సారి విడాకులు ఇచ్చిన భార్యను పునర్వివాహం చేసుకోవడం. ఈ తరహా వివాహం చట్టబద్దతపై సుప్రీం కోర్టులో కేసు పెండింగ్‌లో ఉంది. ఇప్పటికే నిఖా హలాల పద్ధతిని కేంద్రం వ్యతిరేకించింది. ఇది న్యాయసూత్రాలకు విరుద్ధమని కోర్టుకు తెలిపినట్లు కేంద్ర ప్రభుత్వవర్గాలు తెలిపాయి. కాగా సుప్రీంకోర్టు గతంలో తలాక్ అనే అంశం తీవ్రత దృష్ట్యా ఆ కేసును మాత్రమే విచారించింది. గత ఏడాది తలాక్ పద్ధతి రాజ్యాంగ విరుద్ధమని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. తలాక్ పద్ధతికి స్వస్తి చెబుతూ లోక్‌సభ బిల్లును ఆమోదించగా, రాజ్యసభలో పెండింగ్‌లో ఉంది. సర్వోన్నత న్యాయస్థానంలో నిఖా హలాలపై నాలుగు పిటిషన్‌లు విచారణలో ఉన్నాయి.