జాతీయ వార్తలు

కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్, జూన్ 29: జమ్ముకాశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో శుక్రవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. కాగా ఎన్‌కౌంటర్ జరిగిన ప్రదేశంలో ఆందోళనకారులు, భద్రతాబలగాలపై రాళ్లు రువ్విన ఘటనలో ఒక యువకుడు మరణించినట్లు పోలీసులు తెలిపారు. ఉగ్రవాదులు తుమ్మా అనే గ్రామంలో నక్కి ఉన్నారనే సమాచారం తెలిసిన వెంటనే భద్రతా బలగాలు అప్రమత్తమై ఆ గ్రామాన్ని చుట్టుముట్టారు. ఒక ఇంట్లో ముగ్గురు ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో భద్రతా బలగాలు ఆ ఇంటికి వెళ్లే మార్గాన్ని మూసివేశారు. ఆ ఇంట్లో పౌరులు కూడా ఉండడంతో ఆపరేషన్ నిర్వహణ ఆలస్యమైందని పోలీసులు చెప్పారు.
పౌరులను ఖాళీ చేయించిన తర్వాత ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. దీంతో గ్రామంలోని యువకులు భద్రతా బలగాలపై రాళ్లు రువ్వడం ప్రారంభించారు. ఈ సందర్భంగా కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘర్షణలో ఐదుగురికి గాయాలయ్యాయి. రాళ్లు రువ్విన ఘటనలో 16 సంవత్సరాల ఫైజాన్ అహ్మద్ ఖాన్ అనే పౌరుడు మరణించినట్లు పోలీసులు చెప్పారు.

చిత్రాలు..పుల్వామా జిల్లాలో ఉగ్రవాదులు దాగివున్న ఇంటిని చుట్టుముడుతున్న బలగాలు... ఎన్‌కౌంటర్ నేపథ్యంలో సురక్షిత ప్రాంతాలకు తరలుతున్న స్థానికులు...