జాతీయ వార్తలు

కాశ్మీరీ ప్రజలతో ఆర్మీ ‘స్నేహపూర్వక వైఖరి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 29: కాశ్మీర్‌లో గవర్నర్ పాలన విధించిన అనంతరం భద్రతా దళాలు ‘ప్రజలతో స్నేహపూర్వక వైఖరి’ని వ్యవహరిస్తున్నాయని ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ శుక్రవారం వెల్లడించారు. కాశ్మీర్ లోయలో హింస, అస్థిరతను సృష్టిస్తున్న ఉగ్రవాదులను తరిమికొట్టడమే తమ ముందున్న ప్రాథమిక లక్ష్యమని, అదే సమయంలో తమ లక్ష్యసాధనలో సామాన్యపౌరునికి ఎలాంటి ఇబ్బంది కలిగించరాదన్నది తమ ఉద్దేశమని బిపిన్ రావత్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఇప్పుడు భద్రతా దళాల సంఖ్యను పెంచారా అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ వారిని ఎక్కువ సంఖ్యలో మోహరించలేదని, యధాప్రకారం వారి విధులు నిర్వహిస్తున్నారని చెప్పారు. అయితే కొన్ని కఠినమైన నిబంధనలు మాత్రం అమలవుతున్నాయని, విధి నిర్వహణలో ఎలా ఉండాలో స్థానిక కమాండర్లు నిరంతరం సైనికులకు సలహాలు, సూచనలు అందజేస్తున్నారని చెప్పారు. ఇప్పుడు లోయలో తమ సైనిక కార్యకలాపాలు ప్రజలతో స్నేహభావం దిశగా కొనసాగుతున్నాయని, క్రూర పద్ధతుతిలో ఆర్మీ వ్యవహరిస్తోందన్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు. కాశ్మీర్‌లో మానవహక్కుల ఉల్లంఘన జరుగుతోందన్న ఐక్యరాజ్య సమితి నివేదికను ఆయన ఖండించారు.

చిత్రం..కాశ్మీర్ పర్యటనలో ఉన్న ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ అక్కడి యువకులతో ముచ్చటిస్తున్న దృశ్యం.