జాతీయ వార్తలు

అవసరమైతే మరో మెరుపు దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 29: పాకిస్తాన్‌పై అవసరమైతే మరోసారి మెరుపు దాడులు చేయగలమని లెఫ్టినెంట్ జనరల్ డీఎస్ హుడా శుక్రవారం తెలిపారు. పాకిస్తాన్‌కు ఇంకోసారి గట్టిగా బుద్ధి చెప్పాలనుకుంటే భారత దేశం మరోసారి మెరుపుదాడి చేయగలుగుతుందని మొదటి మెరుపుదాడిని రచించి పర్యవేక్షించిన పదవీ విరమణ చేసిన లెఫ్టినెంట్ జనరల్ డీఏస్ హుడా చెప్పారు. ఇస్లామిక్ ఉగ్రవాదుల శిబిరాలపై జరిగిన మొదటి మెరుపు దాడి మొత్తం ఆరు గంటల పాటు కొనసాగింది. ఈ దాడి అర్ధరాత్రి మొదలయి ఉదయం ఆరు గంటల పదిహేను నిమిషాల వరకూ నాలుగో శిబిరంపై కొనసాగిందని హుడా తెలిపారు. మొత్తం మెరుపుదాడి ముందు నిర్ణయించిన ప్రకారం కొనసాగిందని, అనుకున్న సమయానికే దాడులను పూర్తి చేయటంతో పాటు ముందుగా నిర్ణయించిన సమయానికే కమాండోలు సురక్షిత ప్రాంతాలకు చేరుకున్నారని లెఫ్టినెంట్ హుడా వివరించారు. ఉరి సైనిక శిబిరంపై ఇస్లామిక్ ఉగ్రవాదులతో దాడి చేయించి 19 మంది సైనికులను పొట్టనపెట్టుకున్న పాకిస్తాన్‌కు గట్టిగా బుద్ధి చెప్పాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో సైన్యమూ ఏకీభవించింది. అందుకే 2016 సెప్టెంబర్ 29 తేదీన మెరుపుదాడి జరిగిందని లెఫ్టినెంట్ హుడా తెలిపారు. ఆక్రమిత పాకిస్తాన్‌లోని ఇస్లామిక్ ఉగ్రవాదుల శిబిరాలు, వాటిని కాపాడుతున్న పాకిస్తాన్ సైనిక వర్గాలపై 2019 సెప్టెంబర్‌లో భారత సైన్యం జరిపిన మెరుపు దాడిని లెఫ్టినెంట్ హుడా పర్యవేక్షించారు. మెరుపుదాడికి సంబంధించిన వీడియో క్లిప్పులు విడుదల కావటంపై హుడా వ్యాఖ్యానిస్తూ ఉగ్రవాదుల ద్వారా దాడులు చేయిస్తున్న పాకిస్తాన్‌కు గట్టిగా గుణపాఠం చెప్పాలని కేంద్ర ప్రభుత్వం భావించిందని ఆయన అన్నారు. కాగా, రాజకీయ నాయకత్వం తీసుకున్న నిర్ణయంతో సైన్యం కూడా ఏకీభవించిందని, ఉగ్రవాదుల దాడులను అరికట్టాలంటే పాకిస్తాన్‌కు బుద్ధి చెప్పకతప్పదనే భావన అన్ని స్థాయిల్లో వ్యక్తమైందని హుడా తెలిపారు. పాకిస్తాన్‌కు ఇంకోసారి బుద్ధి చెప్పాలని కేంద్రం భావించే పక్షంలో మరోసారి మెరుపుదాడులు జరిపేందుకు భారత సైన్యం సిద్ధంగా ఉంటుందని హుడా అభిప్రాయపడ్డారు. లెఫ్టినెంట్ హుడా మరి కొందరు సీనియర్ సైనికాధికారులు నార్తరన్ కమాండ్‌కు కేంద్రమైన ఉద్దంపూర్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కంట్రోల్ రూం నుండి మెరుపుదాడి కొనసాగుతున్న తీరును కమాండోలు పంపిస్తున్న లైవ్ ఫీడ్ ద్వారా పర్యవేక్షించటంతోపాటు అవసరమైన ఆదేశాలు, సూచనలు, సలహాలు ఇచ్చారు. ఉద్దంపూర్‌లోని నార్తరన్ కమాండ్‌కు పంపించినట్లే ఢిల్లీలోని సైనిక కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూంకు కూడా లైవ్ ఫీడ్ వెళ్లిందని హుడా వెల్లడించారు. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఇస్లామిక్ ఉగ్రవాదుల శిబిరాలు పాకిస్తాన్ సైనిక శిబిరాలకు అత్యంత సమీపంలో ఉండటం వలన తమ కమాండోలు మరింత జాగరూకతతో వ్యవహరించవలసి వచ్చిందని తెలిపారు. ఇస్లామిక్ ఉగ్రవాదుల శిబిరాలు పాకిస్తాన్ సైనిక శిబిరాలకు కొద్దిగా దూరంగా ఉండి ఉంటే కమాండోల దాడి మరోరకంగా ఉండేదని ఆయన చెప్పారు.