జాతీయ వార్తలు

ఎన్‌డీఏను వీడేది లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 8: ఎన్‌డీఏ కూటమిలో కొనసాగటంతోపాటు 2019 లోక్‌సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని బిహార్ ముఖ్యమంత్రి, జేడీయూ జాతీయ అధ్యక్షుడు నితీష్ కుమార్ అధ్యక్షతన దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం జరిగిన పార్టీ కార్యవర్గం సమావేశంలో నిర్ణయించారు. బీజేపీతో పొత్తుల అంశంపై నిర్ణయం తీసుకునే అధికారాన్ని నితీష్ కుమార్‌కు ఇవ్వటంతోపాటు ఈ అంశంపై ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉండాలని జేడీయూ జాతీయ కార్యవర్గం నిర్ణయించినట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి సంజయ్‌కుమార్ ఝా సమావేశానంతరం విలేఖరులతో చెప్పారు. బీజేపీతో నెలకొన్న విభేదాల మూలంగా జేడీయూ కూడా ఎన్‌డీఏ నుండి తప్పుకునే అవకాశాలున్నాయంటూ వార్తలు వచ్చిన నేపథ్యంలో సంజయ్‌కుమార్ ఝా చేసిన ప్రకటన ప్రాధాన్యతను సంతరించుకున్నది. బీజేపీతో విభేదాలు ఉన్నట్లు వస్తున్న వార్తలో నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. బీజేపీ, జేడీయూ కలిసి పోటీ చేసి, మెజారిటీ లోక్‌సభ సీట్లను గెలుచుకుంటాయని ఝా ధీమా వ్యక్తం చేశారు. ఇలావుంటే, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఈనెల 12 తేదీ బిహార్ పర్యటనకు వెళుతున్నారు. ఆయన ఈ సంధర్భంగా నితీష్ కుమార్‌తో సమావేశమై లోక్‌సభ ఎన్నికల్లో ఎవరు ఎన్ని సీట్లలో పోటీ చేయాలనే అంశంపై చర్చించనున్నారు. బిహార్‌లోని 40 లోకసభ సీట్లలో నుండి 17 సీట్లకు పోటీ చేయాలని జేడీయూ ఆలోచిస్తోంది. ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రతికూల పవనాలను ఎదుర్కొంటున్న బీజేపీ ప్రస్తుతానికి జేడీయూతో ఘర్షణకు సిద్ధంగా లేదు. ఆందుకే జేడీయూ కోరుకుంటున్న 17 సీట్లను ఆ పార్టీకే బీజేపీ కేటాయించవచ్చని సమాచారం. కాగా, జేడీయూ జాతీయ కార్యవర్గం సమావేశంలో ఎవరెన్ని సీట్లలో పోటీ చేయాలనే అంశంపై చర్చ జరగలేదు.
ఈ అంశాన్ని నిర్ణయించే అధికారాన్ని నితీష్ కుమార్‌కు ఆప్పగించినందున తుది నిర్ణయం ఆయనే తీసుకుంటారు. గత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 22 సీట్లు గెలిస్తే మిత్రపక్షాలైన రాంవిలాస్ పాశ్వాన్ నాయకత్వంలోని ఎల్‌జేపీ ఆరు, ఉపేంద్ర కుష్వాహ నాయకత్వంలోని ఆర్‌ఎల్‌ఎస్‌పీ మూడు, జేడీయూ రెండు చొప్పున సీట్లు గెలుచుకోవటం తెలిసిందే. గత ఎన్నికల్లో రెండు సీట్లు మాత్రమే సాధించిన జేడీయూ ఇప్పుడు 17 సీట్లు డిమాండ్ చేయటం బీజేపీ నాయకులకు మింగుడు పడటం లేదు. 2015లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ గెలిచిన శాసన సభ సీట్ల ఆధారంగా లోక్‌సభ సీట్లు కేటాయించాలని జేడీయూ డిమాండ్ చేస్తోంది. ఇలావుంటే, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రతిపాదించిన జమిలి ఎన్నికలను సమర్థించాలని జేడీయూ జాతీయ కార్యవర్గం నిర్ణయించింది.