జాతీయ వార్తలు

తాంత్రికమా? మానసికమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 8: ఢిల్లీలోని బురాని ప్రాంతంలో సంచలనం సృష్టించిన 11 మంది అనుమానాస్పద మృతి వెనుక గల పూర్తి కారణాలను పోలీసులు ఇంకా నిర్ధారించలేకపోతున్నారు. దీనివెనుక కారణాలు తాంత్రికమైనవా? మానసిక పరమైనవా? ఆర్థిక పరమైనవా అన్నదానిపై పోలీసులు ఎలాంటి నిర్ధారణకు రాలేదు. ఢిల్లీలోని బురారి ప్రాంతంలో 11 మంది కుటుంబ సభ్యులు అనుమానాస్పద స్థితిలో మృతి చెంది వారం రోజులు గడిచాయి. గత ఆదివారం 11 మంది సభ్యుల కుటుంబం నోటికి, కళ్లకు గుడ్డ కట్టుకుని, చేతులు బంధించుకుని ఉరి వేసిన స్థితిలో మృతి చెంది ఉండటాన్ని గమనించారు. వీరిలో ఇంటి పెద్ద అయిన నారాయణదేవి అనే మహిళ మాత్రం పక్క గదిలో మృతి చెంది ఉంది. ఈ కుటుంబానికి ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవని, వారెప్పుడూ సంతోషంగానే కన్పించే వారని, ఎలాంటి కష్టాలు లేవని ఎవరో వారిని దారుణంగా హత్య చేశారని వారి కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వారు వాదిస్తుండగా, వారు కొన్ని మూఢనమ్మకాలతో ఆత్మహత్యకు పాల్పడ్డారని పోలీసులు నిర్ధారించారు. సంఘటనా స్థలంలో ఆ కుటుంబంలోని చిన్నకుమారుడు లలిత్ సింగ్ రాసిన కొన్ని నోట్‌లను ఈ సందర్భంగా వారు కనుగొన్నారు. 2007లోనే చనిపోయిన తన తండ్రి ఆత్మ తనతో మాట్లాడుతుందని లలిత్ సింగ్ కుటుంబ సభ్యులకు చెప్పేవారని, వారు కూడా దానిని నమ్మేవారని, వారు ఆత్మహత్య చేసుకుంటే మోక్షం లభిస్తుందని, అయితే వారికి మరణం సంభవించదని, తన తండ్రి ఆత్మ వచ్చి వారిని రక్షిస్తుందని నమ్మారని పోలీసులు తెలిపారు. ‘్భమి, ఆకాశాలు కంపిస్తాయి, అయినా మీరు భయపడవద్దు. మిమ్మల్ని నేను రక్షిస్తాను’ అని తన తండ్రి చెప్పినట్టు వారు నమ్మారు. అయితే తమ కుటుంబ సభ్యులు రాసినట్టు చెబుతున్న నోట్స్ గురించి గాని, వారికి సంబంధించిన 11 రిజిస్టర్లను గత పదకొండు సంవత్సరాలుగా రాస్తున్నట్టు గాని తమకు తెలియదని రాజస్థాన్‌లోని కోటాలో నివసిస్తున్న లలిత్ చిన్న తమ్ముడు దినేష్ సింగ్ , పానిపట్‌లోని నాగపాల్‌లో నివసిస్తున్న సోదరి సుజాత నాగపాల్ పోలీసులకు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులను సంప్రదించగా, ఆత్మహత్య చేసుకున్న కుటుంబ ‘షేర్‌డ్ సైకోసిస్’తో బాధపడుతున్నారని తెలిపారు. దీనిప్రకారం ఒకరు నమ్మిన విషయాన్ని మిగిలిన వారందరూ నమ్ముతారని, ఈ కేసులో లలిత్ తాను నమ్మిన విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పగా, వారు కూడా దానిని నిజమని భ్రమించారని, ఏ ఒక్కరు దీనిని వ్యతిరేకించినా పరిస్థితి ఇలా ఉండదని అన్నారు. ఫోరెన్సిక్‌లో పీజీ చేస్తున్న లలిత్ సోదరుడి కుమార్తె కూడా దీనిని నమ్మడం నిజంగా దురదృష్టకరమేనని డాక్టర్లు వ్యాఖ్యానించారు.