జాతీయ వార్తలు

ఫైటర్ జెట్ ప్రాజెక్టుపై భారత్ పునరాలోచన!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 8: రష్యాతో కలిసి సంయుక్తంగా ఫైట్ జెట్ విమానాలను తయారు చేయాలనే ప్రాజెక్టుపై భారత్ పునరాలోచనలో పడింది. భారీ ఖర్చును దృష్టిలో ఉంచుకొని, ఫిఫ్త్ జనరేషన్ ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్ (ఎఫ్‌జీఎఫ్‌ఏ) జెట్ తయారీపై భారత సర్కారు వెనుకంజ వేస్తున్నట్టు సమాచారం. ఈ విషయంపై రష్యా ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు భారత సమాయత్తమవుతున్నది. సంయుక్త శాస్ర్తీ, సాంకేతిక పరిజ్ఞానంతోపాటు, ఖర్చును కూడా ఇరు దేశాలు భరించాలనే ఒప్పందంపై 30 బిలియన్ డాలర్లు (సుమారు 2 లక్షల కోట్ల రూపాయలు) అంచనా వ్యయంతో ప్రాజెక్టును ఇరు దేశాలు 2007లో ఒప్పందం కుదుర్చుకున్నాయి. దీని ద్వారా భవిష్యత్తులో ఇరు దేశాల మధ్య సైనిక ఒప్పందాలు మరింత బలోపేతమవుతాయని అప్పట్లో ప్రకటించారు. కాగా, మొత్తం ఖర్చులో ఎవరు ఎంత భరించాలి? ఎన్ని ఫైటర్ జట్లను తయారు చేయాలి? ఏ దేశానికి ఎన్నింటిని అప్పగించాలి? వంటి అనేక ప్రశ్నలపై ఇంత వరకూ స్పష్టత లేదు. సుమారు రెండు లక్షల కోట్ల రూపాయలతో ఫైటర్ జెట్లను సిద్ధం చేసే ప్రాజెక్టును తలకు మించిన భారంగా ఇప్పుడు భారత సర్కారు భావిస్తున్నది. దీనితో ఈ ఒప్పందం అపలుపై పునరాలోచనలో పడింది.
అయితే, రష్యాతో చర్చలు, సంప్రదింపులు ఇంకా పూర్తి స్థాయిలో జరగలేదని ఈ ఒప్పందంలో భారత్ తరఫున కీలక పాత్ర పోషించిన ఓ ఉన్నతాధికారి పీటీఐతో మాట్లాడుతూ చెప్పారు. ఈ భారీ ప్రాజెక్టుకు అవసరమైన మొత్తంలో భారత్ వాటా ఎంత అనే విషయంపై ఒక అవగాహనకు వచ్చిన తర్వాతే, గత ఒప్పందాన్ని కొనసాగించాలా? లేదా? అనే విషయంలో ఒక నిర్ణయం తీసుకుంటామని ఆ అధికారి పేర్కొన్నారు. నిజానికి, ప్రాజెక్టు డిజైన్ తదితర అంశాలకు సంబంధించి, 2010లో మొదటి విడతగా 295 మిలియన్ డాలర్లను విడుదల చేయడానికి భారత్ అంగీకరించింది. ప్రాజెక్టు చివరి దశలో చెరి ఆరు బిలియన్ డాలర్ల ఖర్చును భరించడానికి కూడా ఇరు దేశాలు సంసిద్ధత వ్యక్తం చేశాయి.
కానీ, ప్రాజెక్టు నిర్మాణంలో ఉన్నప్పటి వ్యయంపై ఇంకా స్పష్టత రాలేదని అంటున్నారు. అందుకే, ఫైటర్ జెట్ ప్రాజెక్టుపై భారత్ ఇంకా ఒక నిర్ణయానికి రాలేకపోతున్నది. పూర్తి స్థాయిలో చర్చలు జరిగితే తప్ప దీనిపై ఒక స్పష్టత రాదన్నది వాస్తవం.