జాతీయ వార్తలు

‘సుప్రీం’ తీర్పు బలాన్నిచ్చింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 8: ఢిల్లీ ప్రజలకు సేవలందించడానికి సుప్రీం కోర్టు తమకు ‘సహేతుకమైన స్వతంత్రత’ను ఇచ్చిందని, దాంతో తాము రాత్రి పగలు పనిచేసి ప్రజల సంక్షేమానికి పాటుపడతామని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఢిల్లీ రాష్ట్ర అధికారాలపై ఈ నెల నాలుగున సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై కేంద్రానికి కాని, లెఫ్టినెంట్ గవర్నర్‌కు కాని ఏమన్నా సందేహాలుంటే సుప్రీంకే వెళ్లి తీర్చుకోవాలని ఆయన సూచించారు. అనధికారికంగా ఉన్న కాలనీలలో డ్రైన్లు, రోడ్ల నిర్మాణానికి తమ ప్రభుత్వం పది రోజుల్లో నిధులను మంజూరు చేస్తుందని ఆయన చెప్పారు. తమ ప్రభుత్వం అభివృద్ధి పనులను నిరంతరాయంగా నిర్వహించడానికి సుప్రీం కోర్టు కావాల్సిన స్వాతంత్య్రాన్ని ఇచ్చిందని ఆయన ట్వీట్ చేశారు. అధికారుల బదిలీలు, నియామకాల విషయంలో వారికి ఏమన్నా సందేహాలు ఉంటే సుప్రీంకోర్టును ఆశ్రయించి తీర్చుకోవాలని సూచించారు. సుప్రీం ఇచ్చిన తీర్పును కేంద్రం, ఎల్‌జి ఒక పథకం ప్రకారం తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నిస్తున్నాయని ఆయన ఆరోపించారు. కోర్టు తీర్పు విషయంలో తమకు ఎలాంటి గందరగోళం లేదని, వారే లేనిపోనివి ఆపాదించుకుంటున్నారని, ఈ విషయంలో వారే స్పష్టత కోసం సుప్రీం ను ఆశ్రయించాలని ఆయన సూచించారు. భూమి, పోలీస్, శాంతి భద్రతలు ఈ మూడు అంశాల్లో తప్ప కేంద్రం, ఎల్‌జికి ఢిల్లీపై ఎలాంటి అధికారాలు లేవని కోర్టు స్పష్టం చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కాగా, ఢిల్లీ ఈశాన్య ప్రాంతంలోని కిరారి తదితర ప్రాంతాల్లో ఉన్న అనధికార కాలనీలను కేజ్రీవాల్ సందర్శించి నిధులు మంజూరు చేయనున్నారు.