జాతీయ వార్తలు

జీవిత ఖైదీలకు పారామెడికల్‌లో శిక్షణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భోపాల్: క్షణికావేశంలో చేసిన తప్పుడు జీవిత ఖైదుతో అనుభవిస్తూ జైళ్లలో మగ్గుతున్న ఖైదీలు వైద్య సేవలు అందించబోతున్నారు. ఇది నిజమేనా అని అనుకోవచ్చు. మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఖైదీలకు పారామెడికల్ కోర్సుల్లో శిక్షణ ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దేశంలో జైళ్ల చరిత్రలో తొలిసారిగా వినూత్న విధానాన్ని మధ్యప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తోంది. 42 మంది ఖైదీలకు మూడు నెలల పాటు పారా మెడికల్ కోర్సులో శిక్షణ ఇస్తున్నారు. వీరిలో నలుగురు మహిళా ఖైదీలు ఉన్నారు. గత నెల 1వ తేదీన ఈ శిక్షణ మొదలైంది. ఈ వివరాలను భోపాల్ జైలు సూపరింటెండెంట్ దినేష్ నార్గవ తెలిపారు. భోపాల్‌కు చెందిన ఒక విశ్వవిద్యాలయం ఈ కోర్సును నిర్వహిస్తోంది. గాయాలు, పుండ్లకు కట్టుకట్టడం, ఇంజెక్షన్లు ఇవ్వడం, ప్రాణాపాయ సమయంలో అత్యవసరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వైద్య చర్యలపై శిక్షణ ఇస్తున్నారు. శిక్షణ పొందుతున్న ఖైదీల్లో హంతకులు ఎక్కువగా ఉన్నారు. జీవిత ఖైదును అనుభవిస్తున్న వారిలో సత్ప్రవర్తన కలిగి ఉన్న ఖైదీలకు శిక్షణ ఇస్తున్నారు. కనీసం పదవ తరగతి ఉత్తీర్ణులైన వారిని ఎంపిక చేసి ఈ శిక్షణ ఇస్తున్నారు. ఇప్పటికే ఐదేళ్ల పాటు శిక్షణ పూర్తి చేసిన వారిని ఈ కోర్సులో చేర్చుకున్నారు. వారానికి రెండురోజుల పాటు ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇస్తున్నారు. ఈ శిక్షణను డాక్టర ప్రేమేందర్ శర్మ ఇస్తున్నట్లు జైలు అధికారులు చెప్పారు.