జాతీయ వార్తలు

కఠినశిక్షలతో అత్యాచారాలు ఆపలేం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 9: కఠినమైన శిక్షలతో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు, అత్యాచారాలను అరికట్టలేమని అమ్మెస్టీ ఇంటర్నేషనల్ ఇండియా అభిప్రాయపడింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో నలుగురు నిందితులకు విధించిన మరణ శిక్షలో ముగ్గురికి ఉరిని ఖరారు చేస్తూ సుప్రీం కోర్టు సోమవారం తీర్పు ఇచ్చిన నేపథ్యంలో అమ్మెస్టీ వ్యాఖ్యలు ప్రాధాన్యాన్ని సంచరించుకున్నాయి. నిందితులకు మరణశిక్ష విధించినంత మాత్రాన లైంగిక హింస తగ్గుముఖం పట్టినట్టు ఎలాంటి ఆధారాలు లేవని ఈ పౌరహక్కుల సంస్థ అభిప్రాయపడింది. అయితే దేశంలోని చట్టాలు సక్రమంగా అమలు కావడానికి ప్రభుత్వాలు తగిన నిధులు కేటాయించాలని, శిక్ష కేసుల శాతం పెరగాలని, అందరికీ తప్పక న్యాయం జరుగుతుందన్న నమ్మకాన్ని కలిగించాలని పేర్కొంది. దురదృష్టవశాత్తు మన సమాజంలో శిక్షలతో మహిళలపై హింస, అత్యాచారాలను నిర్మూలించలేకపోతున్నాం, మరణశిక్షలతో ఇలాంటి నేరాలు గాని, ఇతర నేరాలు గాని తగ్గినట్టు మనకెక్కడా దాఖలాలు లేవు అని అమ్మెస్టీ ఇంటర్నేషనల్ ఇండియా ప్రోగ్రామ్ డైరెక్టర్ అస్మితాబాసు అభిప్రాయపడ్డారు. లైంగిక హింస, అత్యాచారం వంటి నేరాలకు మరణశిక్ష విధించడం సరైంది కాదని జస్టిస్ వర్మ కమిటీ నివేదించిన విషయాన్ని ఆమె ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఇలావుండగా 12 సంవత్సరాలు, అంతకన్న చిన్న వయసు గల బాలికలపై అత్యాచారానికి పాల్పడిన వారికి మరణశిక్షను విధించాలని ఈ ఏడాది ఏప్రిల్‌లో కేంద్రం ఒక ఆర్డినెన్స్‌ను తెచ్చిందన్నారు. దేశంలోని నేరాలను అరికట్టడానికి తీవ్రమైన శిక్ష ఒక్కటే మార్గమని చాలామంది అభిప్రాయపడుతున్నారని, అదే సమయంలో వారు వాటిని తగ్గించడానికి ఉన్న ప్రత్యామ్నాయ మార్గాల గురించి ఆలోచించడం లేదని ఆమె అన్నారు. పరిశోధనా పద్ధతులను మెరుగుపర్చడం, బాధితులకు,వారి కుటుంబాలకు అండగా నిలవడం, వ్యవస్థాగత సంస్కరణలు వంటివి చేపట్టాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. ఇలావుండగా నిర్భయ హంతకులకు విధించిన ఉరిశిక్షను ఖరారు చేస్తూ సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో మరణశిక్షపై అమ్మెస్టీ వెలిబుచ్చిన అభిప్రాయం దేశంలో ఉరిశిక్ష రద్దు చేయాలన్న డిమాండ్‌కు ఊతమిచ్చే పరిస్థితులు కన్పిస్తున్నాయి.