జాతీయ వార్తలు

ఇకనైనా ఉరితీయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 9: దేశంలోనే సంచలనం రేకెత్తించిన నిర్భయ కేసులోని నలుగురు దోషుల్లో ముగ్గురికి ఉరి శిక్ష ఖరారు చేస్తూ సోమవారం సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. 2012నాటి కేసులో తీర్పును సమీక్షిస్తూ ఈమేరకు స్పష్టం చేసింది. సుప్రీం తీర్పుపట్ల ఆనందం వ్యక్తం చేసిన హతురాలి తల్లి ఆశాదేవి, తీర్పు అమలు ఆలస్యమవుతుండటం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘మా పోరాటం ఇక్కడితో పూర్తవ్వలేదు. శిక్షల అమలు ఆలస్యమవుతోంది. ఇది సమాజంలోని అనేకమంది ఆడపిల్లల్ని ఇంకా ఆందోళనకు గురి చేస్తోన్న అంశమే. న్యాయ విధానాన్ని మరింత పగడ్బంధీగా అమలు చేయాలని వ్యవస్థ బాధ్యులను కోరుతున్నా. సత్వరం న్యాయాన్ని అమలు చేయండి. నిర్భయ దోషులను ఉరితీసి భద్రత విషయంలో సమాజంలోని బాలికలు, మహిళల్లో నమ్మకాన్ని పెంచండి’ అని వేడుకున్నారు. సుప్రీం తీర్పు న్యాయవ్యవస్థ పట్ల ప్రజల్లో నమ్మకం పెంచేదిగా ఉందని వ్యాఖ్యానించారు. ‘శిక్షనుంచి తప్పించుకోడానికి దోషులేమీ బాలురు కాదు. నేరానికి పాల్పడ్డవాళ్లు ఎవ్వరైనా శిక్ష అనుభవించాలి. సుప్రీం తీర్పు కచ్చితంగా ప్రజల్లో నమ్మకాన్ని పెంచేదే’ అని వ్యాఖ్యానించారు. ‘రివ్యూ పిటీషన్‌ను సుప్రీం కోర్టు తిరస్కరిస్తుందని మేం ఊహించాం. తీర్పు ఎప్పుడు అమలు చేస్తారన్నదే అసలు విషయం. ఎంతకాలం సమీక్షలతో సాగదీత. ఇప్పటికైనా దోషులను ఉరి తీయాలి. న్యాయ వ్యవస్థపై నమ్మకం పెరిగేలా అది త్వరలోనే నెరవేరుతుందని అనుకుంటున్నా’ అని నిర్భయ తండ్రి బద్రీనాథ్ సింగ్ వ్యాఖ్యానించారు. ‘న్యాయ వ్యవస్థపట్ల నమ్మకం పెంచే గెలుపు క్షణాలివి. సుప్రీం తీర్పు సంతృప్తికరం. కాకపోతే, కేంద్రాన్ని అభ్యర్థించేది ఒక్కటే. తరువాతి ప్రక్రియను త్వరగా ముగించాలని’ అని నిర్భయ కుటుంబ న్యాయవాది మహాజన్ వ్యాఖ్యానించారు. ఉరి తీర్పును పునఃసమీక్షించాలంటూ నిర్భయ కేసులోని ముగ్గురు దోషులు ముకేష్ (29), పవన్ గుప్తా (22), వినయ్ శర్మ (23) దాఖలు చేసిన పిటీషన్లను సోమవారం సుప్రీం కోర్టు తిరస్కరించింది. చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఆర్ భానుమతి, జస్టిస్ అశోక్ భూషణ్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం పిటీషన్లను తిరస్కరిస్తూ, ఈ కేసును మరోసారి సమీక్షించేది లేదంటూ హెచ్చరిక చేసింది. 2017 మే 5న సుప్రీం కోర్టు ఇచ్చిన డెత్ పెనాల్టీ తీర్పుపై నాలుగో దోషి అక్షయ్ కుమార్ సింగ్ (31) ఎలాంటి రివ్యూ పిటీషన్ దాఖలు చేసుకోలేదు. ఈ కేసులో మరో దోషి రామ్‌సింగ్ ఢిల్లీలోని తీహార్ జైల్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడటం తెలిసిందే.
చిత్రం..2012 డిసెంబర్‌లో నిర్భయ కేసులో సుప్రీం తీర్పు వెలువడిన అనంతరం విజయ చిహ్నం చూపుతున్న నిర్భయ తల్లి ఆశా దేవి