జాతీయ వార్తలు

మహారాష్ట్ర కు లేని బాధ మీకెందుకు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 9: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ జన సమితి అధినాయకుడు కోదండరాం తదితరులు కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డుకునేందుకు కుట్రలు చేస్తున్నారని తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. సుప్రీం కోర్టు సోమవారం ఇచ్చిన తీర్పు కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్న వారికి చెంపపెట్టు లాంటిదని ఆయన వ్యాఖ్యానించారు. హరీశ్‌రావు సోమవారం తెలంగాణ భవన్‌లో విలేఖరులతో మాట్లాడుతూ- కాళేశ్వరం ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ కోర్టుల్లో కేసులు వేస్తున్నవారిపై విమర్శలు గుప్పించారు. విలేఖరుల సమావేశంలో టీఆర్‌ఎస్ ఎంపీలు వినోద్‌కుమార్, ప్రభాకర్ రెడ్డి, శాసన సభ్యుడు చింతా ప్రభాకర్ పాల్గొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై దొంతి లక్ష్మీనారాయణ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు సోమవారం కొట్టివేసింది. ఈ వివాదాన్ని రాష్ట్ర హైకోర్టులోనే తేల్చుకోవాలని సుప్రీం కోర్టు సూచించిందని హరీశ్ చెప్పారు. కాళేశ్వరం అంతర్‌రాష్ట్ర వివాదమంటూ లక్ష్మీనారాయణ చేసిన వాదనను కొట్టివేస్తూ- మహారాష్టక్రు లేని బాధ మీకెందుకు అని సుప్రీం కోర్టే ప్రశ్నించిందని ఆయన వివరించారు. మహారాష్టక్రు హైకోర్టు నోటీసులు జారీ చేసినప్పుడు తమ వద్దకు రావాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసిందని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై వచ్చిన అంశాలను ప్రస్తావిస్తూ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీవారు ఏదో ఒక వంకతో కాళేశ్వరం ప్రాజెక్టును ఆపేందుకు ప్రయత్నించటం సిగ్గుచేటని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టును బయటివారు అడ్డుకుంటే అర్థం చేసుకోవచ్చు.. కానీ మన రాష్ట్రానికి చెందినవారే
అడ్డుపడటం బాధాకరమని హరీశ్‌రావు అన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి మంచిపేరు రాకూడదనే కుట్రతోనే వీరిలా అడ్డుకుంటున్నారని హరీశ్‌రావు దుయ్యబట్టారు. ఒక ప్రాజెక్టుపై ఇన్ని కేసులు వేయటం విచిత్రంగా ఉన్నదని అన్నారు. కాంగ్రెస్, తెలుగుదేశం, కోదండరాం.. వీరంతా ఒక పథకం ప్రకారం కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డుకుంటున్నారని ఆరోపించారు. కేంద్ర జల సంఘం ప్రాణహితకు ఒక్క అనుమతి కూడా ఇవ్వలేదు. ప్రత్యామ్నాం చూసుకోమన్నందుకే కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టామన్నారు. 14 నుండి 1404 టీఎంసీల సామర్థ్యం గల రిజర్వాయర్లతో కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టి అన్ని అనుమతులు సంపాదించుకుంటే వీరిలా అడ్డుకోవటం ఏమిటి అని హరీశ్ నిలదీశారు. కేంద్ర ప్రభుత్వం, కేంద్ర జల సంఘం అన్ని అంశాలను లోతుగా పరిశీలించిన తరువాతే అనుమతులు మంజూరు చేసిందని ఆయన వివరించారు. తుమ్మిడిహట్టి వద్ద ఎందుకు నిర్మించలేదని వీరు ప్రశ్నిస్తున్నారు. వాస్తవానికి నీళ్లులేనిచోట ప్రాజెక్టును ప్రతిపాదించి డబ్బు ఖర్చు చేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నించిందని అన్నారు. తాము అందుకు భిన్నంగా నీరున్నచోట రిజర్వాయర్లు నిర్మించి, పెట్టిన పెట్టుబడులకు మంచి ఫలితాలను సాధించేందుకు ప్రయత్నిస్తున్నామని హరీశ్ చెప్పుకొచ్చారు. నీరు లేని చోటునుండి నీరున్న చోటికి ప్రాజెక్టును మార్చి ఉత్తర తెలంగాణను సస్యశ్యామలం చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు కృషి చేస్తున్నారని తెలిపారు. ప్రాణహితకు అనుమతులు సంపాదించటంలో కాంగ్రెస్‌వారు విఫలమయ్యారు.. ఇప్పుడు కాళేశ్వరం విషయంలో ఇలా మాట్లాడటం దుర్మార్గమని ఆయన తీవ్రంగా విమర్శించారు. పోలవరం నిర్మాణం ఏకపక్షంగా జరుగుతోంది కాబట్టే ఒడిశ్శా, చత్తీస్‌గఢ్ రాష్ట్రాలు అభ్యంతరం చెబుతున్నాయన్నారు. తాము కాళేశ్వరం విషయంలో మహారాష్టత్రో ఒప్పందం చేసుకుని ముందుకు సాగుతున్నాము కాబట్టే ఆ రాష్ట్రం నుండి ఎలాంటి అభ్యంతరం లేదని హరీశ్‌రావు తెలిపారు. మహారాష్టత్రో కుదుర్చుకున్న ఒప్పందాన్ని కేంద్ర జల సంఘానికి ఇచ్చాం కాబట్టే గొడవలు లేవన్నారు. సుప్రీం కోర్టు తీర్పు దృష్ట్యా కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డుకుంటున్నవారు ఇకనైనా బుద్ధి తెచ్చుకుని ప్రజల ప్రయోజనాలు కాపాడేందుకు కృషి చేయాలని హరీశ్‌రావు హితవు చెప్పారు.

చిత్రం..తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు