జాతీయ వార్తలు

పర్యాటకులను ఆకర్షించడానికి చైనాలో రోడ్‌షోలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 9: చైనా నుంచి మరింత మంది పర్యాటకులను ఆకర్షించడానికి ఆ దేశంలో తాము రోడ్‌షోలను నిర్వహించనున్నట్టు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కెజె ఆల్ఫోన్స్ తెలిపారు. ఈ మేరకు ఆయన దానికి సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేశారు. రాబోయే మూడేళ్లలో భారత్‌ను సందర్శించే పర్యాటకుల సంఖ్యను రెట్టింపు చేయాలన్నది తమ ధ్యేయమని ఆయన చెప్పారు. పర్యాటకరంగ అభివృద్ధికి గత సంవత్సరం తాము ఇతోధిక ప్రయత్నాలు చేశామని చెప్పారు. పర్యాటక రంగాన్ని ప్రమోట్ చేయడానికి తాము అమెరికాలో చేసిన రోడ్‌షోలు మంచి ఫలితాన్ని ఇచ్చాయని, అదేవిధంగా ఇప్పుడు రష్యా, ఇతర ఐరోపా దేశాలలో రోడ్‌షోలను వచ్చే రెండు వారాల్లో చేపడతామన్నారు. పర్యాటకపరంగా మనకు చైనా అతిపెద్ద వనరని, ఆ దేశంలోని టూరిస్టులను ఆకర్షించడానికి పెద్దయెత్తున రోడ్‌షోలు నిర్వహించనున్నట్టు ఆయన చెప్పారు. ఆ దేశానికి చెందిన 144 మిలియన్ల మంది ప్రతిఏడాది వివిధ దేశాలను సందర్శిస్తారని, వారిలో 2.5 లక్షల మంది మాత్రమే మన దేశం వచ్చారని ఆయన చెప్పారు. ఈ సంఖ్యను ఎంతో పెంచాల్సిన అవసరం ఉందన్నారు. మొదటిసారిగా మనదేశాన్ని సందర్శించిన పర్యాటకుల సంఖ్య గత ఏడాది పది మిలియన్లను దాటించదన్నారు. అలాగే గత ఏడాదితో పోల్చుకుంటే విదేశీ పర్యాటకుల సంఖ్య 15.6 శాతం పెరిగిందన్నారు.
దీనిని 20.8 శాతానికి పెంచాలనుకుంటున్నట్టు మంత్రి చెప్పారు. మొదటిసారిగా ఇండియా టూరిజం మార్ట్‌ను సెప్టెంబర్ 16 నుంచి 18 వరకు ఇక్కడి విజ్ఞాన్ భవన్‌లో నిర్వహిస్తామని చెప్పారు. టూరిజం శాఖ, ఫెయిత్ భాగస్వామ్యంతో దీనిని చేపడతామన్నారు. దీని ద్వారా ప్రపంచవ్యాప్తంగా కొనుగోలుదారులను ఆకర్షిస్తామన్నారు. ఈ సందర్భంగా టూరిజం కార్యదర్శి రష్మీ వర్మ మాట్లాడుతూ రాష్ట్రాలు తమ ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్త మార్కెట్ పొందడానికి ఈ మార్ట్ ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. వారు తమ ఉత్పత్తులను ఇందులో ప్రదర్శించవచ్చునని, అంతర్జాతీయ స్థాయిలో తమ వ్యాపారాన్ని విస్తరించడానికి ప్రముఖులతో చర్చలు జరపవచ్చునని చెప్పారు. విదేశాల నుంచి వచ్చే పర్యాటకులకు సిమ్ కార్డులు ఇచ్చే విధానాన్ని ఆపివేస్తున్నామని, సిమ్‌కార్డులు ఇవ్వాల్సిన అవసరం లేదని గుర్తించి ఈ చర్య తీసుకున్నట్టు తెలిపారు. తాము నిర్వహించే టూరిజం మార్ట్ ద్వారా 300 మంది వ్యాపారవేత్తలను ఆకర్షించాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నట్టు చెప్పారు.