జాతీయ వార్తలు

అనువంశ పాలనకు చాణక్యుడు వ్యతిరేకి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 9: ప్రాచీన తత్వవేత్త చాణుక్యుడి నీతి వర్తమాన రాజ్య పాలనకూ సరిగ్గా అమరుతుందని బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా వ్యాఖ్యానించారు. అయితే అనువంశ పాలనకు చాణుక్యుడు వ్యతిరేకి అన్న విషయం గుర్తెరగాలంటూ పేరు ప్రస్తావించకుండానే కాంగ్రెస్‌పై విమర్శనాస్త్రాలు సంధించారు. పుణెలో స్వచ్ఛంద సంస్థ రాంబాహు మాల్గి ప్రబోధిని నిర్వహించిన కార్యక్రమంలో ఆర్య చాణుక్యుడి జీవితంపై ప్రసంగిస్తూ, రాజకీయ, ఆర్థిక, విదేశీ వ్యవహారాలపై చాణక్య నీతివ్యూహాలు, ఆలోచనలు ఇప్పటి కాలానికీ ప్రామాణికమేనన్నారు. ‘పాలనుకు సంబంధించి ఆయన ఆలోచనా విధానాన్ని ఒక్కసారి సమగ్రంగా పరిశీలించండి. అనువంశ రాజ్యపాలనకు ఆయన వ్యతిరేకమన్న విషయం మనకు స్పష్టంగా బోధపడుతుంది’ అని వ్యాఖ్యానించారు. ‘రాజ్య పాలనకు సామర్థ్యమే తప్ప సీనియారిటీ అర్హత కాదు, కాకూడదు’ అన్న విషయం చాణుక్య నీతిలో కనిపిస్తుందన్నారు. కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు రాహుల్ స్వీకరించిన దగ్గర్నుంచీ అవకాశం దొరికినప్పుడల్లా బీజీపీ ఎత్తిపొడుస్తోన్న విషయం తెలిసిందే. కుటుంబ నేపథ్యం నుంచి రాహుల్ ఆ పదవికి ఎదిగాడు తప్ప, సామర్థ్యంతో కాదన్నది బీజీపీ తరచూ చేస్తోన్న ఆరోపణ. చాణక్య నీతి ప్రకారం రాజ్యపాలనకు సమర్థుడైన అర్హుడు ఎవరని ప్రశ్నించుకుంటే, అందుకు నరేంద్ర మోదీ స్పష్టమైన ఉదాహరణగా కనిపిస్తారని షా తన ప్రసంగంలో మరో అడుగు ముందుకేశారు. ‘రాజు అనేవాడు రాజ్యాంగానికి సేవకుడన్న విషయాన్ని చాణక్యుడు ఎప్పుడో రాసిపెట్టాడు. తాను ప్రధాన సేవకుడినేనని ప్రధాని మోదీ చెబుతున్నది అందుకే’ అని షా పేర్కొన్నారు. అభివృద్ధి ఫలాలు చిట్టచివరి వ్యక్తికీ అందాలన్నది చాణక్య నీతిలోనే ఉందని, ప్రధాని మోదీ నినాదం ‘సబ్‌కా సాత్ సబ్‌కా వికాస్’ అర్థం అదేనని అమిత్ షా వ్యాఖ్యానించారు.

చిత్రం..రాంబాహు మాల్గి ప్రబోధిని నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా