జాతీయ వార్తలు

ఆరు విద్యా సంస్థలకు ‘ఎమినెస్’ హోదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 9: దేశంలో మొత్తం ఆరు విద్యా సంస్థలకు ‘ఎమినెస్’ (గొప్ప లేదా ఘనత వహించిన) హోదాను ఇచ్చినట్టు జాతీయ మానవ వనరుల మంత్రిత్వ శాఖ (హెచ్‌ఆర్‌డీ) ప్రకటించింది. ప్రభుత్వ రంగంలోని విద్యా సంస్థలకేగాక, ప్రైవేటు రంగానికి కూడా దీనిని వర్తింప చేస్తారు. వచ్చే ఐదేళ్ల కాలానికి మూడు యూనివర్శిటీలకు హెచ్‌ఆర్‌డీ 1,000 కోట్ల రూపాయలను కేటయించింది. ఎమినెస్ హోదాను పొందిన పబ్లిక్ రంగ విద్యా సంస్థలు మాత్రమే ప్రభుత్వ గ్రాంట్‌ను ఇస్తారు. ప్రైవేటు రంగంలోని సంస్థలకు ఈ హోదా దక్కినప్పటికీ, గ్రాంట్ లభించదు. కాగా, వచ్చీ ఐదేళ్ల కాలానికిగాను పబ్లిక్ సెక్టార్‌లో ఐఐటీ ఢిల్లీ, ఐఐటీ బాంబే, బెంగళూరుకు చెందిన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైనె్సస్ (ఐఐఎస్‌సి) సంస్థలకు ఎమినెస్ హోదా లభించింది. ప్రైవేటు రంగంలో ఈ హోదాకు మణిపాల్ అకాడెమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్, బిట్స్ పిలానీ, రిలయెన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలోని జియో ఇన్‌స్టిట్యూట్‌కు ఎమినెస్ హోదా దక్కింది. ఎమినెస్ ఇన్‌స్టిట్యూట్‌గా గుర్తింపు పొందడంతో, ఈ విద్యా సంస్థలకు అటామస్ హోదా లభిస్తుంది. పబ్లిక్, ప్రైవేట్ రంగాల్లో చెరి పది చొప్పున మొత్తం 20 విద్యా సంస్థలకు ఎమినెస్ హోదాను ఇవ్వాలని, తద్వారా ఆయా సంస్థలు స్వతంత్రంగా పని చేసే వీలు కల్పించాలని హెచ్‌ఆర్‌డీ భావిస్తున్నది. జాతీయ ఎన్నికల కమిషన్ మాజీ చీఫ్ గోపలస్వామి నేత్వంలోని నిపుణుల కమిటీ (ఈఈసీ) తొలి విడతగా ఆరు విద్యా సంస్థలను ఎంపిక చేసింది. ప్రపంచ ర్యాంకింగ్స్ ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించింది.