జాతీయ వార్తలు

వృద్ధుల్లో నాలుగో వంతు ఒంటరే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 9: ఒకపక్క దేశ జనాభా వంద బిలియన్ కోట్లకు చేరుకుది.. అయితే దేశంలో నివసిస్తున్న వృద్ధుల్లో నాలుగో వంతు మాత్రం సమాజంలో ఒంటరితనంతో గడుపుతున్నారని ఒక సర్వే వెల్లడించింది. ఢిల్లీకి చెందిన ఏజ్‌వెల్ ఫౌండేషన్ 10 వేల మంది వృద్ధులపై నిర్వహించిన సర్వే అనంతరం ఈ వివరాలను తెలియజేసింది. సమాజంలోని ప్రతి నలుగురు వృద్ధులలో ఒకరు, అనగా 25 శాతం ఒంటరిగా జీవితాన్ని వెల్లదీస్తున్నారని పేర్కొంది. అలాగే వృద్ధులలో 48.88 శాతం తమ జీవిత భాగస్వాములతో ఉన్నారని, 26.5 శాతం తమ పిల్లలు, ఇతర కుటుంబ సభ్యులతో జీవిస్తున్నారని ఈ సర్వే వెల్లడించింది. అయితే గ్రామీణ ప్రాంతాల్లో కన్నా పట్టణ ప్రాంతాల్లో పరిస్థితి మరింత అధ్వాన్నంగా ఉందని తెలియజేసింది. పట్టణ ప్రాంతాల్లో ఒంటరి వృద్ధుల శాతం 25.3 ఉండగా, గ్రామీణంలో 21.38 శాతం ఉంది. అయితే చాలామంది వృద్ధులు ఒంటరిగా గాని, తమ భాగస్వామితో గాని నివసించాలని కోరుకుంటున్నారు. దీని ద్వారా వారు స్వతంత్ర హోదాను అనుభవిస్తున్నారు. అయితే వీరిని వేధిస్తున్న సమస్యల్లా ఆర్థికంగా ఇతరులపై ఆధారపడటం. ఇలావుండగా 68.24 శాతం మంది స్వతంత్రంగా జీవించడాన్ని ఇష్టపడుతున్నారు. తాము స్వతంత్రగా జీవించడానికి ఈ ముదిమి వయసులో వైద్యపరమైన సేవలు అందించాలని 88.5 శాతం కోరుతున్నారు. వృద్ధాప్యంలో ఉన్న వారికి ఆర్థికపరమైన స్వతంత్రత కల్పించాలని, అదే సమయంలో వారు అనారోగ్యపరమైన ఇబ్బందులు అధిగమించడానికి నిత్యం వారికి వైద్య సదుపాయం కల్పించాలని అప్పుడే మనం సమాజంలోని వృద్ధులను తగిన విధంగా గౌరవించిన వారమవుతామని సర్వే నిర్వహించిన ఏజ్‌వెల్ ఫౌండేషన్ నిర్వాహకులు హిమన్స్‌రాథ్ అభిప్రాయపడ్డారు. తాము ఈ సర్వేను ఈ ఏడాది మే, జూన్ నెలల్లో దేశంలోని 20 రాష్ట్రాల్లో నిర్వహించినట్టు చెప్పారు.