జాతీయ వార్తలు

జమిలికి మద్దతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: లోక్‌సభ, శాసన సభలకు ఒకేసారి ఎన్నికలు జరిపించే ప్రతిపాదనను వైఎస్‌ఆర్‌సీపీ సమర్థించింది. వైఎస్‌ఆర్‌సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి, శాసన మండలి సభ్యుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మంగళవారం లా కమిషన్‌ను కలిసి జమిలి ఎన్నికలను పార్టీ సమర్థిస్తోందని తెలిపారు. వారీ మేరకు లా కమిషన్‌కు పార్టీ లేఖను అందజేశారు. జమిలి ఎన్నికలు దేశానికి కొత్త కాదని, 1951 నుండి 1967 వరకు లోక్‌సభ, శాసన సభలకు ఒకేసారి ఎన్నికలు జరిగాయని విజయసాయి రెడ్డి చెప్పారు. జమిలి ఎన్నికలు జరపటం వలన అనవసరపు ఖర్చును తగ్గించటంతోపాటు భద్రతా దళాలను సద్వినియోగం చేసేందుకు వీలు కలుగుతుందని వైఎస్‌ఆర్‌సీపీ తమ లేఖలో తెలిపింది. జమిలి ఎన్నికల వలన ప్రభుత్వంలో ఉన్న వారు అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించేందుకు వీలు కలుగుతుందని విజయసాయి రెడ్డి అభిప్రాయపడ్డారు. ఎన్నికలు తరుచు జరగటం వలన అభివృద్ధి
కుంటుపడుతోంది. బడుగు, బలహీన వర్గాల సంక్షేమం ఆశించిన స్థాయిలో జరగటం లేదన్నారు. జమిలి ఎన్నికలపై అందరి అభిప్రాయాలు తెలుసుకునేందుకు లా కమిషన్ చేస్తున్న కృషిని విజయసాయి రెడ్డి, ఉమారెడ్డి వెంకటేశ్వర్లు అభినందించారు. 1999లోనే అప్పటి లా కమిషన్ అధ్యక్షుడు న్యాయమూర్తి జీవన్ రెడ్డి జమిలి
ఎన్నికలు నిర్వహించాలనే సిఫారసు చేశారని విజయసాయి రెడ్డి గుర్తు చేశారు. పార్లమెంటు స్టాండింగ్ కమిటీ 2015లో ఇచ్చిన నివేదికలో జమిలి ఎన్నికలను సిఫారసు చేసిందనేది మరిచిపోరాదని ఆయన చెప్పారు. ఎన్నికల కోసం ఎన్నికల కమిషన్ చేసే ఖర్చు, రాజకీయ పార్టీలు చేసే ఖర్చు బాగా తగ్గిపోతాయన్నారు. అయితే జమిలి ఎన్నికలు సవాళ్లతో కూడుకున్న పని అని, లోక్‌సభ, శాసన సభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు రాజ్యాంగానికి అవసరమైన సవరణలు చేయాలని వారు సూచించారు. ఎన్నికలు తరచు జరగటం వలన అవినీతి విపరీతంగా పెరిగిపోతోంది. జమిలి ఎన్నికల వలన ఈ అవినీతిని బాగా అదుపు చేయవచ్చునన్నారు. పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని సవరించాలని విజయసాయి రెడ్డి డిమాండ్ చేశారు. పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు కేంద్ర ప్రభుత్వం కూడా దుర్వినియోగం చేస్తోందని వారు దుయ్యబట్టారు. పార్టీ ఫిరాయింపుల విషయంలో చట్టసభల స్పీకర్లకు ఉన్న అధికారాలను ఎన్నికల కమిషన్‌కు బదిలీ చేసే విధంగా రాజ్యాంగాన్ని సవరించాలని విజయసాయి రెడ్డి డిమాండ్ చేశారు. తమ పార్టీకి చెందిన 23 మంది శాసన సభ్యులు తెలుగుదేశం పార్టీలోకి ఫిరాయించారు. తెలుగుదేశం పార్టీ ఫిరాయించిన ప్రతి శాసన సభ్యుడికి ఇరవై నుండి ఇరవై ఐదు కోట్ల రూపాయలు చొప్పున ఇచ్చిందని ఆయన ఆరోపించారు.

చంద్రబాబు మోసగాడు
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అతిపెద్ద మోసగాడని విజయసాయి రెడ్డి ఆరోపించారు. చంద్రబాబు నాయుడు పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని ఉల్లంఘించారని ఆయన దుయ్యబట్టారు. పార్టీ ఫిరాయింపుల విషయంలో తమ పార్టీ చేసిన ఫిర్యాదుపై చర్య తీసుకోకపోవటానికి ఎన్‌డీఏ ప్రభుత్వం బాధ్యత వహించకతప్పదని ఆయన స్పష్టం చేశారు. తమ పార్టీకి చెందిన ముగ్గురు ఎంపీలు తెలుగుదేశంలోకి, ఒక లోక్‌సభ సభ్యుడు టీఆర్‌ఎస్‌లోకి ఫిరాయించారన్నారు. వీరిపై చర్య తీసుకోవాలని తాము ఎప్పటి నుండో కోరుతున్నా లోక్‌సభ స్పీకర్ పట్టించుకోవటం లేనరి, వారిపై ఎలాంటి చర్య తీసుకోవటం లేదని ఆయన ఆరోపించారు.

చిత్రం..మీడియాతో మాట్లాడుతున్న ఎంపీ విజయసాయిరెడ్డి