జాతీయ వార్తలు

ప్రాచీన భాషలకు భవిష్యతేంటి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 10: మనదేశంలో ప్రాచీన భాషలకు రానురాను ఆదరణ తగ్గుతుంది. మున్ముందు వీటి మనుగడే కష్టమవుతుందేమోనని భాషాభిమానులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా సంస్కృతం, పాళి, ప్రాకృతి భాషలు కనుమరుగయ్యే ప్రమాదం ఏర్పడింది. వీటిమీద అభిమానంతో డిగ్రీ, పోస్టుగ్రాడ్యుయేట్ కోర్సులు చదివిన వారు తమ కెరీర్ పట్ల ఆందోళన చెందుతున్నారు. అసలు వీటితో తమకు ఉద్యోగాలొస్తాయా, మా భవిష్యత్ ఏమిటి అని ప్రశ్నిస్తున్నరు. ఢిల్లీకి చెంది న పూజాది కూడా అదే పరిస్థితి. సంస్కృతంలో పోస్టుగ్రాడ్యుయేట్ అయిన ఆమె ఇప్పుడు ఏం చేయాలో తెలియని అయోమయ స్థితిలో ఉంది. ‘లెక్చరర్‌గా అర్హత పొందడానికి నేను ఎన్నిసార్లు నేషనల్ ఎలిజిబిలిటీ టెస్టు రాయాలి? నాకు సంస్కృతంలో లెక్చరర్‌గా ఉద్యోగం వస్తుందా? అసలు ఏదన్నా ఉద్యో గం వస్తుందా? లేక ఖాళీగా ఇంటివద్ద కూర్చోవాలా?’ అన్న ప్రశ్నలు ఆమెను వేధిస్తున్నాయి. ఈ బాధ ఒక్క పూజాదే కాదు. సంస్కృతం, ఇతర ప్రాచీన భాషలు అభ్యసించిన వారందరూ ఎదుర్కొంటున్నదే. తాము చదివిన చదువుకు లభించే ఉద్యోగాలు ఏమిటో తెలియక, ఆ భాషపై ఉన్న మమకారాన్ని వదులుకోలేక మథన పడుతున్నారు. సంస్కృతం చదువుకున్నావా? మహా అయితే ట్రాన్స్‌లేటర్‌వో, టీచర్‌వో, మీడియాలో చిన్న ఉద్యోగివో అవుతావు అని పలువురు అంటున్నారని పూజా ఆవేదన వ్యక్తం చేసింది. దీనిని సెయింట్ స్టిఫెన్ కాలేజీలో సంస్కృతంలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న పంకజ్ మిశ్రా సైతం అంగీకరించారు. రానురాను సంస్కృతం, తదితర ప్రాచీన భాషలకు ఆదరణ తగ్గుతోందని చెప్పారు. సం స్కృతం ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసే వారికి పేజీకి 200 నుంచి 300 రూపాయల వరకు మాత్రమే చెల్లిస్తున్నారని, ఇది ఒక రోజుకూలీకి లభించే ఆదాయం కన్నా తక్కువని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఇంగ్లీష్, హిందీ సబ్జెక్టుల కటాఫ్ మార్కులు 98,91 శాతం ఉండగా, ఈ సంవత్సరం సంస్కృతం కటాఫ్ మా ర్కు 85శాతం మాత్రమే ఉందన్నారు. ఢిల్లీలో ఆర్ట్స్, కామర్స్ సబ్జెక్టులు బోధిస్తున్న 69 కాలేజీల్లో కేవలం 29 వాటిలో మాత్ర మే సంస్కృతం కోర్సు ఉందని ఆయన చెప్పారు. కాగా, ఢిల్లీ యూనివర్సిటీ లోని బుద్ధిస్టు స్టడీ శాఖ తెలిపిన వివరాల ప్రకా రం ఈ శాఖలో 234 పీజీ సీట్లు ఉండగా అందులో 125 సీట్లు ప్రతి సంవత్సరం ఖాళీగా ఉంటాయని చెప్పారు. పలు బౌద్ధ పుస్తకాలు పాళి భాషలో ఉంటాయని, అయినా ఈ భాష కోర్సులకు ఆదరణ లేదని ఆ శాఖ హెడ్ కెటిఎస్ సరావ్ చెప్పారు. సంస్కృతం భాషను హిందుత్వానికి, పాళి భాషను బుద్ధిజానికి ఎందుకు ముడిపెట్టారో తనకు అర్థం కాదని ఆయన చెప్పారు. ఇలావుండగా సంస్కృతి భాష అభివృద్ధికి తగు చర్యలు తీసకుంటున్నట్టు హర్యానా, ఢిల్లీ ప్రభుత్వాలు తెలిపాయి. ముఖ్యంగా సంస్కృతం భాషకు జీవం పోయడానికి ఢిల్లీప్రభుత్వం నగర వ్యాప్తంగా 70 సంస్కృతం కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు తెలిపింది. ఆప్షనల్ సబ్జెక్టుగా ప్రవేశపెట్టడానికి చర్యలు తీసుకుంటున్నట్టు హర్యానా వెల్లడించింది.