జాతీయ వార్తలు

నవ భారత్ నిర్మాణంలో ఈశాన్య రాష్ట్రాలకు భాగస్వామ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షిల్లాంగ్: ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని, నవ భారత్ నిర్మాణంలో ఈశాన్య రాష్ట్రాలను భాగస్వాములను చేసిన ఘనత తమ ప్రభుత్వానికి దక్కుతుందని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం పారదర్శకతతో కూడిన విధానాలను అమలు చేస్తోందన్నారు. మంగళవారం ఇక్కడ ఈశాన్య రాష్ట్రాల మండలి 67 వార్షికోత్సవ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సమాచార టెక్నాలజీ, వౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. ఈ ప్రాంతం సమగ్రాభివృద్ధికి రోడ్ల అనుసంధానం చాలా ముఖ్యమన్నారు. అప్పుడే ఆర్థికాభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. 2022 నాటికి కొత్త భారత్‌ను సాధించాలన్న లక్ష్యంతో ప్రధాని నరేంద్రమోదీ ఉన్నారన్నారు. మునుపెన్నడూ లేని విధంగా ఇక్కడ రోడ్ల అభివృద్ధిని పెద్ద ఎత్తున చేపట్టినట్లు ఆయన చెప్పారు. యువతకు ఉద్యోగావకాశాల కల్పన కోసం ఈశాన్య రాష్ట్రాల్లో ఇంటర్నెట్ సదుపాయాన్ని కల్పిస్తున్నామన్నారు. బ్రాడ్‌బాండ్ సర్వీసులు విస్తరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఈ ప్రాంతంలోని ప్రజలు సుదూర ప్రాంతాలకు జీవనోపాధి నిమిత్తం వలసవెళ్లే సంస్కృతికి చెక్‌పెడతామని, ఇక్కడే అద్భుతమైన ఉద్యోగాల కల్పనకు బ్లూప్రింట్ ఖరారు చేయనున్నట్లు చెప్పారు. పెద్ద సంఖ్యలో ఐటిఐ, పాలిటెక్నిక్ కాలేజీను ఏర్పాటు చేస్తున్నామన్నారు. నైపుణ్యాభివృద్థికి ప్రాధాన్యత ఇస్తామన్నారు. ఈశాన్యరాష్ట్రాల్లో ప్రాంతీయ నైపుణ్యాభివృద్ధి కేంద్రాన్ని నెలకొల్పనన్నట్లు చెప్పారు. ప్రైవేట్ పెట్టుబడులు పెద్ద ఎత్తున వచ్చే విధంగా ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతామన్నారు. 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు అయ్యేటట్లు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఈ ప్రాంతం నుంచి సూపర్ ఫాస్ట్ ఏసీ వ్యాగన్ల ద్వారా పూలు, పండ్లను దేశంలో ఇతర ప్రాంతాలకు శరవేగంగా రవాణా చేస్తామన్నారు. ఈశాన్య రాష్ట్రాల ప్రాంతీయ వ్యవసాయ మార్కెటింగ్ సంస్ధను ఏర్పాటు చేస్తామన్నారు. ప్రస్తుతం ఈశాన్య రాష్ట్రాల్లో శాంతి వాతావరణం ఉందని, అభివృద్ధి చెందేందుకు సానుకూల పరిస్థితులు ఉన్నాయన్నారు. అభివృద్ధి ఫలాలు ప్రజలకు అందాలని, లోపాలేమైనా ఉంటే సరిదిద్దుకోవాలన్నారు.

చిత్రం..కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్