జాతీయ వార్తలు

పీఏసీ సభ్యునిగా సీఎం రమేష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: తెలుగుదేశం రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి భారీ మెజారిటీతో విజయం సాధించి అందరినీ ఆశ్చర్యపరిచారు. రమేష్‌కు 106 ఓట్లు పడితే బీజేపీ అభ్యర్థి భూపేందర్ యాదవ్‌కు 69 ఓట్లు, జేడీ(యూ) అభ్యర్థి హరివంశ్‌కు 26 ఓట్లు లభించటం గమనార్హం. పీఏసీకి చెందిన రెండు రాజ్యసభ ఖాళీలను భర్తీ చేసేందుకు సోమవారం ఎన్నికలు జరిగాయి. ఈ రెండు ఖాళీలకు టీడీపీ సభ్యుడు రమేష్, బీజేపీ సీనియర్ నేత
భూపేందర్ యాదవ్, జేడీ(యూ) సీనియర్ నాయకుడు హరివంశ్ పోటీపడ్డారు. భూపేందర్ యాదవ్ తరపున బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా స్వయంగా తమ పార్టీ సభ్యులతోపాటు ప్రతిపక్షానికి చెందిన కొందరు రాజ్యసభ సభ్యులతో మాట్లాడారు. యాదవ్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన అందరికీ విజ్ఞప్తి చేశారు. అమిత్ షా తన ఓటు హక్కును వినియోగించుకున్న తరువాత భుపేందర్ యాదవ్‌కు మద్దతుగా అక్కడే కొంతసేపు నిలబడిపోయారు. అయినా రమేష్ ప్రతిపక్షంతోపాటు ఎన్‌డీఏ భాగస్వామ్య పార్టీలకు చెందిన రాజ్యసభ సభ్యుల ఓట్లు సంపాదించుకుని భారీ మెజారిటీతో విజయం సాధించారు. రాజ్యసభలో బీజేపీ నాయకత్వంలోని ఎన్‌డీఏకు 106 మంది సభ్యులున్నారు. భుపేందర్ యాదవ్ కంటే ప్రతిపక్షానికి చెందిన రమేష్‌కు ఎక్కువ ఓట్లు పడడంటం పార్లమెంటులో చర్చనీయాంశంగా మారింది. భారీ మెజారిటీతో పీఏసీ సభ్యుడిగా ఎన్నికైన రమేష్‌ను ప్రతిపక్షంతోపాటు అధికార పక్షం సభ్యులు కూడా అభినందించారు.