జాతీయ వార్తలు

మరింత క్షీణించిన కరుణానిధి ఆరోగ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, ఆగస్టు 6: అనారోగ్యం కారణంగా కొద్దిరోజుల కిందట ఇక్కడి కావేరీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం. కరుణానిధి అరోగ్యం సోమవారం బాగా క్షీణించింది. వయోభారం రీత్యా ఆయన ఆరోగ్య పరిస్థితిని నిలకడగా ఉంచడం తమకు సవాల్‌గా మారిందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. 94 ఏళ్ల కరుణానిధి ఆరోగ్య పరిస్థితిపై ఆసుపత్రి వర్గాలు తాజా బులెటిన్‌ను విడుదల చేశాయి. మరో 24 గంటలు గడిస్తేగానీ ఆయన శరీరం ఎంతవరకు చికిత్సకు సహకరిస్తుందన్న విషయం చెప్పలేమని ఆసుపత్రి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ అరవిందన్ సెల్వరాజ్ తెలిపారు. గతనెల 28న తీవ్ర అనారోగ్యంతో కావేరీ ఆసుపత్రిలో చేరిన కరుణానిధి ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతోందని కొద్దిరోజుల కిందట వైద్యులు చెప్పారు. ప్రత్యేక నిపుణుల బృందం కరుణానిధి ఆరోగ్య పరిస్థితులను పర్యవేక్షిస్తోంది. కరుణానిధి ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారుతోందని వైద్యులు ధ్రువీకరించడంతో డీఎంకే అభిమానులు భారీ సంఖ్యలో ఆసుపత్రికి చేరుకున్నారు.