జాతీయ వార్తలు

9న రాజ్యసభ ఉపాధ్యక్షుడి ఎన్నిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 6: రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎంపిక ఈ నెల తొమ్మిదో తేదీన జరుగుతుందని చైర్మన్ ఎం.వెంకయ్య నాయుడు సోమవారం ప్రకటించారు. ఈ పదవికి పోటీ పడాలనుకునేవారు 8వ తేదీ మధ్యాహ్నం పనె్నండు గంటలలోగా నామినేషన్లు దాఖలు చేయాలని ఆయన తెలిపారు. బీజేపీ అధినాయకత్వం రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పదవికి జేడీ(యూ)కు చెందిన సీనియర్ సభ్యుడు హరివంశ్‌ను రంగంలోకి దించుతోంది. ప్రతిపక్షం తరపున తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ సభ్యుడు సుఖేందు శేఖర్ రాయ్ పోటీపడే అవకాశాలున్నాయి. బీజేపీ మొదట అకాలీదళ్‌కు చెందిన సీనియర్ నాయకుడు నరేష్ గుజ్రాల్‌ను పోటీ చేయించాలనుకున్నది.. అయితే తాను పోటీలో లేనని గుజ్రాల్ ప్రకటించారు. దీనితో బీజేపీఇప్పుడు హరివంశ్‌ను పోటీకి దించుతున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ముగిసేందుకు ఒక రోజు ముందు డిప్యూటీ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ చేపట్టటం గమనార్హం. కాంగ్రెస్ సభ్యుడు పీజే కురియన్ పదవీ విరమణ చేయడంతో డిప్యూటీ చైర్మన్ పదవికి ఖాళీ ఏర్పడడం తెలిసిందే. రాజ్యసభ మొత్తం సభ్యుల సంఖ్య 245. 122 మంది సభ్యుల మద్దతు సంపాదించుకున్నవారు డిప్యూటీ చైర్మన్‌గా ఎన్నికవుతారు. ప్రస్తుతం రాజ్యసభలో బీజేపీ ఏకైక పెద్దపార్టీ అయినప్పటికీ మొత్తమీద ప్రతిపక్షానికే మెజారిటీ ఉన్నది. అన్నా డీఎంకేకు చెందిన 14 మంది సభ్యులతో కలిసి బీజేపీ బలం 106. ఆ పార్టీ ప్రతిపాదించే అభ్యర్థి విజయం సాధించాలంటే మరో 18 మంది సభ్యుల మద్దతును కూడగట్టవలసి ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన ఆరుగురు సభ్యులు బీజేపీ ప్రతిపాదించే అభ్యర్థికి మద్దతు ఇచ్చే అవకాశాలున్నాయి. బీజేపీ అధినాయకత్వం ఈ అంశంపై ఇది వరకే టీఆర్‌ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుతో చర్చలు జరిపినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. జేడీ(యూ)కు చెందిన ఆరుగురు హరివంశ్‌కు మద్దతు ఇస్తారు. దీనికి అదనంగా బీజేడీకికి చెందిన 9మంది సభ్యులు మద్దతిస్తే హరివంశ్ సునాయసంగా విజయం సాధిస్తారు. కొందరు చిన్న పార్టీల సభ్యులు, ఇండిపెండెంట్లు కూడా హరివంశ్‌కు మద్దతిచ్చే అవకాశాలున్నాయి.

చిత్రం..జేడీ(యూ) సభ్యుడు హరివంశ్